ఆ సినిమా విషయంలో అల్లరి నరేష్‌కు షాకిచ్చిన స్వర్ణ కార సంఘాలు.. ?  

allari naresh latest movie controversy over , allari naresh, latest movie, controversy, gold smiths, bangaru bullodu - Telugu Allari Naresh, Bangaru Bullodu, Controversy, Gold Smiths, Latest Movie

సినిమా ఎంత శ్రమతో కూడుకున్న పనో తెలియాలంటే ఆ షూటింగ్‌లను దగ్గరగా మనసు పెట్టి చూస్తే మాత్రమే అర్ధం అవుతుంది.ఇంతలా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని నిర్మించే చిత్రం వివాదాల్లో చిక్కుకుంటే జరిగే నష్టం ఏంతో మాటల్లో చెప్పలేం.

TeluguStop.com - Https Telugustop Com Wp Content Uploads 2021 01 Allari Naresh Latest Movie Controversy Over Jpg

కాని ఆ చిత్రాన్ని నిర్మించిన బృందానికి మాత్రం యమ టెన్షన్‌గా ఉంటుంది.

ఇదిగో ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రం కూడా వివాదాల్లో చిక్కుకుంది.

TeluguStop.com - ఆ సినిమా విషయంలో అల్లరి నరేష్‌కు షాకిచ్చిన స్వర్ణ కార సంఘాలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలపై స్వర్ణ కార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తమ వృత్తిని కించపరిచేలా చూపించిన కొన్ని సీన్లను సినిమాలోంచి తొలగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేశాయి.

అంతే కాకుండా రిలీజ్‌కు ముందు ప్రివ్యూ వేయాలని, లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని అడ్డుకుంటామని స్వర్ణ కార సంఘాలు హెచ్చరించాయట.

ఇకపోతే గిరి పి దర్శకత్వంలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై, అల్లరి నరేష్, ‌పూజా జవేరీ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపధ్యంలో ఇలాంటి వివాదం తెరపైకి రావడంతో చిత్రయూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుందట.

#Gold Smiths #Controversy #Allari Naresh #Bangaru Bullodu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు