ఫ్యాన్స్‌కు చరణ్‌ విజ్ఞప్తి.. సూపర్‌ అంటున్న ఫ్యాన్స్‌

ఈ నెలలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బర్త్‌డే ఉన్న విషయం తెల్సిందే.ఆయన బర్త్‌డే వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరు మరియు కేరళలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

 Https Telugustop Com Wp Content Uploads 2020 03 Ram Charan Says No Birthday Cel-TeluguStop.com

ఈ సమయంలో కరోనా కారణంగా బర్త్‌డే వేడుకలు వద్దంటూ ఫ్యాన్స్‌కు చరణ్‌ విజ్ఞప్తి చేశాడు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అస్సలు ఎలాంటి వేడుకలు పెట్టుకోవద్దంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన కారణంగా అదే ఉద్దేశ్యంతో చరణ్‌ తన బర్త్‌ డే వేడుకలను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్‌లో పలు ప్రదేశాల్లో చరణ్‌ బర్త్‌డే వేడుకలు నిర్వహించాలని ఫ్యాన్స్‌ నిర్ణయించారు.అందుకోసం నిహారికతో పాటు పలువురు మెగా ఫ్యామిలీకి చెందిన వారిని ఆహ్వానించారు.కాని ఈ సమయంలో చరణ్‌ ఫ్యాన్స్‌కు లేఖ రాయడంతో బర్త్‌డే వేడుకలను కాస్త క్యాన్సిల్‌ అయ్యాయి.కరోనా కారణంగా బర్త్‌డే వేడుకలు వద్దంటూ ఫ్యాన్స్‌ ఆరోగ్యం నేపథ్యంలో ప్రకటించిన రామ్‌ చరణ్‌ మంచి మనసుకు సూపర్‌ అంటూ ఫ్యాన్స్‌ కితాబిస్తున్నారు.

బర్త్‌డే వేడుకలు క్యాన్సిల్‌ అయినా కూడా సోషల్‌ మీడియాలో ఆరోజున రచ్చ రచ్చగా ట్రెండ్‌ అయ్యేలా చేయాలని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

Telugu Charan, Niharika, Ram Charan, Ram Charan Rrr-Movie

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్‌ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది.ఆ కారణంగా బర్త్‌డే కు ఫస్ట్‌లుక్‌ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఖచ్చితంగా రామ్‌ చరణ్‌ లుక్‌ను జక్కన్న విడుదల చేస్తాడంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి జక్కన్న ఎలా చరణ్‌ బర్త్‌డేను సెలబ్రేట్‌ చేస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube