లక్ష ముత్యాలు పొదిగిన డ్రెస్సులో అలియా భట్... వైరల్ అవుతున్న ఫోటో!

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్( Alia Bhatt ) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఆలియా ప్రస్తుతం కూతురికి జన్మనివ్వడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.ఇలా సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

 Alia Bhatt On Her Met Gala Outfit Made With 1 Lakh Pearls Jms, Ranbir Kapoor, Al-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా అలియా భట్ ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా అలియా న్యూయార్క్ సిటీలో  జరుగుతున్న మెట్ గాలా 2023 ( Met Gala 2023 )వేడుకల్లో ప్రత్యక ఆకర్షణగా నిలిచింది.ఈ వేడుక కోసం ఈమె ఏకంగా లక్ష ముత్యాలతో( One Lakh Pearls ) ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.ఇలా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ సంప్రదాయ తరహాలో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను.ఈ ఎండ్రాయిడరీని భారత్ లోనే లక్ష ముత్యాలతో రూపొందించారు.

ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ డ్రెస్ ధరించడం చాలా సంతోషాన్ని కలిగించింది అంటూ ఈమె తెలియజేశారు.

ఈ విధంగా అలియా భట్ ఈ ఫోటోని షేర్ చేయడంతో ఎంతోమంది నెటిజెన్స్, ఇతర సెలబ్రిటీలు కూడా అలియా డ్రెస్ పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ అలియా ఫోటోలపై స్పందిస్తూ.ఎంతో అందంగా చూడచక్కగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేశారు.

బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆలియా ఈ డ్రెస్ పై కామెంట్లు కురిపిస్తున్నారు.అలియా గత ఏడాది ఏప్రిల్ నెలలో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

ఇక ఈ దంపతులకు రాహా ( Rahaa ) అనే ఒక కుమార్తె కూడా జన్మించిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube