కోట్ల రూపాయల పారితోషకం .. కానీ గోడలు పగిలిన ఇంట్లో స్టార్ హీరో

హృతిక్ రోషన్ బాలీవుడ్ టాప్ హీరో.ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటాడు.

 Hritik Roshan Rented House Worst Position-TeluguStop.com

ఏది కావాలంటే.అది క్షణాల్లో ముందుకు తెచ్చుకోగల సత్తా ఉన్న హీరో.

ఇలాంటి టాప్ స్టార్ తాజాగా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఆశ్చర్యం కలిగిస్తుంది.ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది? అనే విషయాన్ని తెలుసుకుందాం.

 Hritik Roshan Rented House Worst Position-కోట్ల రూపాయల పారితోషకం .. కానీ గోడలు పగిలిన ఇంట్లో స్టార్ హీరో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ ఓ రెంట్ హౌస్ లో దిగాడు.తాజాగా ఆ ఇంట్లో ఉంటూ ఓ సెల్పీ తీసుకున్నాడు.అందులో గోడకు నీటి చెమ్మ వచ్చి పై పెలుసు ఊడిపోయినట్లు కనిపిస్తుంది.నీరు బయటకు లీక్ కావడంతో ఇలా ఏర్పడింది.

తాజాగా ఈ ఫోటో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.బాలీవుడ్ టాప్ హీరో ఇలాంటి ఇంట్లో ఉండటం ఏంటి? అనుకున్నారు.వెంటే ఓ అభిమాని ఈ విషయాన్ని గుర్తించాడు.హృతిక్ జీ.స్పష్టంగా గమనించండి.మీ ఇంట్లో గోడ తడిగా ఉందని చెప్పాడు.

వెంటనే ఆ కామెంట్ కు రిప్లై ఇచ్చాడు.నేను ప్రస్తుతం రెంట్ ఇంట్లో ఉంటున్నాను.

త్వరలోనే సొంత ఇళ్లు తీసుకుంటానని చెప్పాడు.

దీనికి మరో విషయాన్ని యాడ్ చేశాడు.తడిగా లేనట్లయితే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకుంటాం సోదరా? అన్నాడు.అటు గత ఏడాది అక్టోబర్ లో ముంబై రోషన్లు జుహులో ఒక అపార్ట్ మెంట్ లో రెంటుకు ఉండేవాడు.ఆ తర్వాత 97.5 కోట్ల రూపాయలతో ఒక అపార్ట్ మెంట్ లో 2 ఫ్లాట్లు తీసుకున్నాడు.38 వేల చదరపు అడుగుల్లో ఉన్న ఈ ఫ్లాట్లు అరేబియా సముద్రం వైపు అద్భుతమైన సీనరీ కలిగించేలా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఆ పనులు పూర్తి కాగానే తను ఇందులోకి వెళ్లే అవకాశం ఉంది.అప్పటి వరకు ఈ రెంట్ ఇంట్లో ఉండనున్నాడు.

#HritikRoshan #Crore #Hritik Roshan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు