విక్రమ్ మేధా రీమేక్ బాలీవుడ్ మొదలెట్టేశారు

తమిళ్ లో మాధవన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీగా విక్రమ్ వేదా సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.గాయత్రి, పుష్కర్ దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ సినిమా మూడేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

 Hrithik Roshan To Fight Saif Ali Khan In Hindi Remake Of Vikram Vedha, Tollywood-TeluguStop.com

పోలీస్, రౌడీ మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ తరహాలోనే ఈ సినిమా కథనం ఉన్నా కూడా ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉండటం, అలాగే థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉండటంతో పాటు మాధవన్, విజయ్ సేతుపతి పోటీ పడి నటించడంతో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాని తెలుగులో వెంకటేష్ మరో హీరోతో కలిసి రీమేక్ చేయాలని అనుకున్నారు.

సురేష్ ప్రొడక్షన్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా సొంతం చేసుకున్నారని టాక్ వినిపించింది.అయితే ఎందుకనో సెట్స్ పైకి వెళ్ళలేదు.

కాని ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ మాత్రం చాలా వేగంగా సిద్ధమైపోతుంది.హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ చిత్రంగా దీనిని తెరకెక్కించే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇందులో గ్యాంగ్ స్టార్ వేద పాత్రలో హృతిక్ కనిపిస్తాడని, అలాగే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ ఇప్పటికే జరుగుతున్నట్లు సమాచారం.

ఇక హృతిక్ రోషన్ కూడా వేద క్యారెక్టర్ కి తగ్గట్లుగా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడానికి వర్క్ అవుట్స్ చేస్తున్నాడు.ఇక త్వరలో ఈ సినిమా పట్టాలు ఎక్కనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఒరిజినల్ ని తెరకెక్కించిన గాయత్రి, పుష్కర్ ద్వయం ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube