ప్రియుడిని పెళ్ళాడనున్న హృతిక్ రోషన్ మాజీ భార్య.. అతని వివరాలివిగో!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గురించి మనందరికీ తెలిసిందే.హృతిక్ రోషన్, సుసానే ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత 14 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపి అనంతరం 2014లో విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.

 Hrithik Roshan's Ex-wife Sussanne Khan To Marry Arslan Goni,sussanne Khan, Hrithik Roshan, Marraige, Bollywood, Second Marriage,hrithik Roshan Ex Wife Sussane Khan,arslan Goni,saba Azad-TeluguStop.com

అయితే ఈ విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ ఈ జంట అప్పుడప్పుడు మీడియా కంట పడుతూనే ఉంది.ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ ప్రస్తుతం బాలీవుడ్ నటి,సింగర్ సబా అజాద్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

సుసానే ఖాన్ కూడా ప్రస్తుతం అర్స్లాన్‌ గోనీతో పీకల్లోతు ప్రేమలో ఉంది.ఇది ఇలా ఉంటే సుసానే ఖాన్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

 Hrithik Roshan's Ex-wife Sussanne Khan To Marry Arslan Goni,Sussanne Khan, Hrithik Roshan, Marraige, Bollywood, Second Marriage,Hrithik Roshan Ex Wife Sussane Khan,Arslan Goni,Saba Azad-ప్రియుడిని పెళ్ళాడనున్న హృతిక్ రోషన్ మాజీ భార్య.. అతని వివరాలివిగో-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేమిటంటే ఈమె తన ప్రియుడితో కలిసి రెండో పెళ్లికీ సిద్ధమైనట్టు తెలుస్తోంది.తాజాగా అందిన సమాచారం ప్రకారం.తన ప్రియుడితో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతోందని, కానీ పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా జరగనుంది అని సమాచారం.మరి పెళ్లి ఎప్పుడు ఎక్కడ అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక వీరిద్దరి ప్రేమ వివాహారం గురించి ఇప్పటికే పలు రకాల కథనాలు కూడా వినిపించాయి.అంతేకాకుండా ఈ జంట ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకొని తిరగడం,డిన్నర్ డేట్స్ కు,పార్టీలకు జంటగానే హాజరవ్వడం ఇలా ఎన్నోసార్లు వీరిద్దరి కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Telugu Arslan Goni, Bollywood, Hrithik Roshan, Marraige, Saba Azad, Sussanne Khan-Latest News - Telugu

ఈ జంట ఇక ఇరువురి బర్తడేలకు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా వారి ప్రేమను వ్యక్తపరుస్తూ బర్త్డే విషెస్ చెప్పేవారు.రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించడంతో,హృతిక్ రోషన్ అభిమానులు మరి హృతిక్ రోషన్,సబా అజాద్ లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఆ కామెంట్స్ పై హృతిక్ రోషన్ సబా అజాద్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.కాగా హృతిక్ రోషన్ జంట కూడా పార్టీలకు,డిన్నర్ డేట్స్ కు జంట గా హాజరవుతున్న విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube