ఈ ఫొటోలో రజినీ కాంత్ తో ఉన్న ఈ సూపర్ స్టార్ ఎవరంటే?

రజినీకాంత్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని పేరు.ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమకి వచ్చి కోట్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ రజినీకాంత్.

 Hrithik Roshan Childhood Photo With Super Star Rajinikanth,super Star Rajinikant-TeluguStop.com

రజినీకాంత్ తన సినీ జీవితంలో ఎక్కని మెట్టు లేదు.రజినీ కాంత్ తన సినిమాల ద్వారా కంటే తన వ్యక్తిత్వంతోనే అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఎంత ఎదిగినా తాను ఎక్కి వచ్చిన మొదటి మెట్టును ఇప్పటి వరకు మర్చిపోని గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ రజినీకాంత్.తాజాగా రజినీ కాంత్ కు సినిమా రంగంలోని అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇక రజినీ కాంత్ దేశంలోని నటులు, దర్శకులు, అభిమానుల నుండి పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిసింది.ఇక బాలీవుడ్ నటీ నటులు కూడా రజినీకాంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక తాజాగా రజినీకాంత్ కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.అయితే ఈ ఫొటోలో ఓ చిన్నారిని హత్తుకున్న ఈ బాలుడు ఎవరిని రజినీ అభిమానులు ఎవరని తెగ వెతికేస్తున్నారు.

అయితే రజినీకాంత్ తో ఉన్న ఈ చిన్నారి బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్.రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్బంగా హృతిక్ రోషన్ ఈ ఫోటోను షేర్ చేసాడు.

మిమ్మల్ని నేను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగానని, మీరు రోజు రోజుకు ఎదుగుతూ ఉన్నారని హృతిక్ తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube