హృతిక్ రోషన్ కి అరుదైన గౌరవం… ఆస్కార్ నుంచి ప్రత్యేక ఆహ్వానం  

hrithik roshan another achievement, Oscar awards committee, Tollywood, bollywood, Hollywood, Indian Cinema - Telugu Bollywood, Hollywood, Hrithik Roshan Another Achievement, Indian Cinema, Oscar Awards Committee, Tollywood

బాలీవుడ్ రాకుమారుడు, సూపర్ హీరో హృతిక్ రోషన్ కి ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉంది.ఓ విధంగా చెప్పాలంటే హాలీవుడ్ హీరోల స్థాయిలో అతనికి ఇతర దేశాలలో కూడా ఫాలోయింగ్ ఉంది.

 Hrithik Roshan Another Achievement For Oscar Awards Committee

ఈ నేపధ్యంలో అతనికి మరో అరుదైన గౌరవం దక్కింది.ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఆస్కార్ అవార్డుల కమిటీ నుంచి హృతిక్ రోషన్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది.

హృతిక్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులకు ఈ అకాడమీ అవార్డుల కమిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూసే అత్యంత పెద్ద పండగ ఆస్కార్ అవార్డుల వేడుక.

హృతిక్ రోషన్ కి అరుదైన గౌరవం… ఆస్కార్ నుంచి ప్రత్యేక ఆహ్వానం-Movie-Telugu Tollywood Photo Image

జీవితంలో ఒకసారైన ఆస్కార్ అవార్డు అందుకోవాలని హాలీవుడ్ నటులు కలలు కంటూ ఉంటారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల వేడుక ప్రతి ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.

వచ్చే యేడాదిలో జరగనున్న ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేశారు.ఏప్రిల్ 25న అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం జరపబోతున్నట్టు ఆస్కార్ అవార్డుల కమిటీ వెల్లడించింది.

ఆస్కార్ వేడుకల చరిత్రలో ఈ వేడుక వాయిదా వేయడం నాల్గోసారి జరిగింది.ఇక ఈ అవార్డుల వేడుకలలో భారత్ నుంచి హృతిక్ రోషన్ కి ప్రత్యేక ఆహ్వానం లభించింది.

తమ అభిమాన నటుడుకి ఇలా ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానం అందడంపై సోషల్ మీడియాలో హృతిక్ అభిమానులు విపరీతంగా పోస్టులు చేస్తున్నారు.

#Hollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hrithik Roshan Another Achievement For Oscar Awards Committee Related Telugu News,Photos/Pics,Images..