నితిన్‌కు హృతిక్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు ఈ హీరో.

 Hrithik Praises Nithin Rashmikas Tribute-TeluguStop.com

‘అ ఆ’ వంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన ఈ హీరో గతకొంతకాలంగా సరైన హిట్లు లేక వెనకబడిపోయాడు.దీంతో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలో భీష్మ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో మనముందుకు వస్తున్నాడు ఈ హీరో.

కాగా భీష్మ సినిమా ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా ఈ సినిమా చిత్ర షూటింగ్‌లో హీరో నితిన్ మరియు హీరోయిన్ రష్మిక కలిసి ఓ వీడియో చేసారు.

ఈ వీడియోలో నితిన్ మరియు రష్మిక కలిసి ఓ డ్యాన్స్‌ స్టెప్‌తో అదరగొట్టారు.ఈ వీడియోను బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్‌కు అంకితమిచ్చారు.ఈ వీడియోను చూసిన హృతిక్ రోషన్ భీష్మ చిత్ర యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలిపాడు.

నితిన్,రష్మికలు తీసిని వీడియో తనకు నచ్చిందని, కానీ మ్యూజిక్‌కు స్టెప్పులు సింక్ కాలేదని ఫన్నీ కామెంట్ చేశాడు.

దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.నితిన్ వీడియోకు హృతిక్ రెస్పాండ్ కావడంతో భీష్మ సినిమాపై అంచనాలు పెరిగాయని అంటున్నారు చిత్ర యూనిట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube