అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానంటున్న కిలేడి....చివరికి

ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి అందమైన శరీరాన్ని ఉపయోగిస్తున్నారు.మరికొందరైతే ఏకంగా ఆ శరీరాన్ని ఎరగా వేసి డబ్బులు గుంజే ప్రయత్నాలు చేస్తున్నారు.

 Hr Manager Maharashtra-TeluguStop.com

తాజాగా ఓ అందమైన యువతి తన శరీరంతో సంపన్నులకు వల వేస్తూ వారితో పరిచయాలు పెంచుకొని చివరికి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వారిపై రేప్ కేసు పెడతానంటూ బెదిరించిన ఘటన పూణే లో చోటుచేసుకుంది.

పూణే స్థానిక పరిసర ప్రాంతంలో ఓ అందమైన యువతి నివాసం ఉంటోంది.

ఈమె హెచ్ఆర్ మేనేజర్ గా స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తోంది.అయితే ఈమె రోజు తన ఉద్యోగ రీత్యా పలువురు వ్యక్తులను కలుస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో ఓ వ్యక్తి తనతో ప్రేమలో పడ్డాడు.అయితే ఇదే అదునుగా చేసుకున్న ఆ యువతి అతడిని డబ్బులు డిమాండ్ ఇవ్వమని చేసేది.

ఇందులో భాగంగా ఏకంగా ఏడు లక్షల రూపాయలు తనకు ఇవ్వాలని లేకపోతే తనపై రేప్ కేస్ పెట్టడమే కాకుండా తన సంబంధం గురించి తమ కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కల వారికి తెలిపి పరువు తెస్తానని బెదిరించసాగింది.

Telugu Maharashtra-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

అయితే  కుటుంభ సభ్యుల పరువు గురించి ఆలోచించినటువంటి ఆ యువకుడు ప్రస్తుతానికి తన దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బును చెల్లించగా అది సరిపోదంటూ తనకు పూర్తి మొత్తంలో 7లక్షల రూపాయలు డబ్బులు కావాలంటూ అతనిపై ఒత్తిడి తెచ్చింది.దీంతో ఆ యువకుడు చేసేదేమీలేక దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు.బాధితుడి వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు ఆమెపై విచారణ చేపట్టగా తన అందంతో ఇప్పటికే చాలామంది యువకుల్ని వలలో వేసుకొని అడ్డదారుల్లో డబ్బులు సంపాదిస్తోందంటూ పోలీసుల విచారణలో వెల్లడైంది.

దీంతో వెంటనే ఆమెను పోలీసులు అరెస్టు చేసి విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube