అభ్యర్థుల ఎంపిక పట్ల పట్టభద్రుల నిర్ణయం ఎలా ఉండనుందంటే?

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది.

 How Will The Graduates Decide On The Selection Of Candidates ,mlc Eiections ,ts-TeluguStop.com

అయితే గత ఎన్నికల్లో ఎక్కువగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులు, వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో నిరుద్యోగం పూర్తిగా పెరిగిపోవడం, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరేవేర్చకపోవడంతో పట్టభద్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలుచుండడంతో టీఆర్ఎస్ అభ్యర్థులపై ఇప్పుడు పట్టభద్రుల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

అయితే ఈసారి జర్నలిస్టు అభ్యర్థులకు మద్దతిచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే సహజంగా జర్నలిస్ట్ వృత్తి అనేది ప్రశ్నించే వృత్తి కాబట్టి పట్టభద్రుల సమస్యలపై కూడా కౌన్సిల్ లో ప్రశ్నిస్తారని పట్టభద్రులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే టీఆర్ఎస్ కూడా పట్టభద్రుల ఆగ్రహాన్ని గ్రహించి, త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఏది ఏమైనా పట్టభద్రుల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరి పట్టభద్రుల నిర్ణయం ఎలా ఉంటుందనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.ఎలాగూ తెలంగాణ ప్రభుత్వంపై పట్టభద్రులకు తీవ్ర ఆగ్రహం ఉన్న నేపథ్యంలో మిగతా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు.

ఏది ఏమైనా పట్టభద్రుల నిర్ణయంపైనే ఎమ్మెల్సీ అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube