సడెన్ గా టెక్ కంపెనీలలో ఉద్యోగాల కోతలు దేనికి? భారత్‌పై ప్రభావం వుంటుందా?

టెక్ ఉద్యోగస్తులకు గడ్డుకాలం నడుస్తోందా? అవుననే అనిపిస్తోంది.ఈమధ్యకాలంలో చూసుకుంటే ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను నిర్దాక్షణ్యంగా తొలగించాయి.

 How Will Tech Companies Layoffs Effect India Details, Technology Updates, Techno-TeluguStop.com

ఈ క్రమంలో గూగుల్ (ఆల్ఫాబెట్), మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో సిబ్బందిని తీసేస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం గమనార్హం.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం… 2023 జనవరి 20న, Google CEO సుందర్ పిచాయ్ లే-ఆఫ్స్‌ గురించి తన ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ పంపిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలోనే వర్క్‌ఫోర్స్‌ను తగ్గించడానికి వివిధ విభాగాల నుంచి 12,000 మంది ఉద్యోగులను Google తొలగిస్తోంది.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ 3000 మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో… కంపెనీలు ఇంత వేగంతో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నాయి, భారతదేశ ప్రజలను ఎంత వరకు ప్రభావితం చేస్తుంది? అనే ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి.

Telugu Financial, Google, Latest, Meta, Tech Layoffs, Ups-Latest News - Telugu

ఈ క్రమంలోనే పట్నా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం టెక్ కంపెనీలకు బాగోలేదని చెప్పారు.గ్లోబల్ మాంద్యం భయాల వల్ల ఇంకా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ముందస్తుగానే తొలగిస్తాయని, ఆ ప్రభావం భరత్ పైన కూడా బాగా ఉంటుందని తెలిపారు.మరీ ముఖ్యంగా, కాంట్రాక్ట్‌పై పని చేస్తున్నవాళ్లు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

Telugu Financial, Google, Latest, Meta, Tech Layoffs, Ups-Latest News - Telugu

మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, తన కంపెనీ నుంచి 11,000 మంది ఉద్యోగులను తొలగించడానికి కారణం అంతే పెద్ద సంఖ్యలో సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడమే.నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులు అనారోగ్యానికి గురయ్యారు.వాళ్ల గైర్హాజరీ వల్ల కంపెనీ పనితీరు ప్రభావితం కాకూడదు కాబట్టి, చాలా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించాయి.ఇపుడు ఆర్ధిక మాంద్యం చుట్టుముట్టడంతో ఉద్యోగస్థులు ప్రమాదంలో పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube