ట‌మాటాలు తింటే నిజంగా ఆ స‌మ‌స్య‌లు వ‌స్తాయా??

ట‌మాటాలు.ఎర్రగా, అందంగా, చూడముచ్చటగా కనిపించే వీటిని తిన‌కుండా ఉండ‌లేరు.ట‌మాటాల‌ను ఏ కూర‌లో వేసినా.అద్భుతంగానే ఉంటుంది.అందుకే వీటిని కుర‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తారు.ఇక కూర‌కు చ‌క్క‌టి రుచే కాదు.

 How Tomatoes Can Affect Your Kidneys And Heart?, Tomatoes, Kidneys, Heart, Lates-TeluguStop.com

ఆరోగ్యాన్ని పెంపొందించ‌డంలోనూ గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.ట‌మాటాల్లో విటమిన్‌ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.

ఇవి రోగ‌నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌ర‌చ‌డంతో పాటు క‌ళ్లు, చ‌ర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.అలాగే అనేక‌ వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి.ఇక ప్రతి రోజు టమోటాలు ఆహారంతోపాటు తీసుకుంటుంటే అధిక‌బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.ఎందుకంటే.

టమాటాలు తింటే కడుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది.త‌ద్వ‌రా ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వీలుప‌డ‌దు.

తక్కువ ఆహారము తీసుకోవడం వల్ల బరువు త‌గ్గొచ్చు.

Telugu Tips, Ups, Heart, Kidneys, Latest, Tomatoes-

అయితే ట‌మాటాలు తిన‌డం వ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయ‌ని, గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని చాలా మంది న‌మ్ముతారు.ఈ నేప‌థ్యంలోనే ట‌మాటాల‌కు దూరంగా ఉంటారు.టమాటాల్లో ఆక్సలేట్ ఉంటుంది.

ఇది మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు సహకరిస్తాయి.అయితే, ఈ ఆక్సలేట్ కేవలం టమాటాల్లోనే కాదు.

ఇత‌ర కూరగాయల్లోనూ ఉంటుంది.టమాటాల్లో ఆక్సైట్ చాలా తక్కువ పరిమాణం ఉంటుంది.
కాబట్టి.అది మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పరచలేవు.అయితే ట‌మాటాల‌ను ఎప్పుడైతే మోతాదు మించి తీసుకుంటామో.అప్పుడు శ‌రీరంలో ఆక్సలేట్ స్థాయిలు పెరిగి కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా.

ఇక ట‌మాటాలు తింటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి అన్న‌దానిలో ఎలాంటి నిజం లేదు.వాస్త‌వానికి గుండె సమస్యలను నివారించ‌డంలో ట‌మాటాలు బాగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా తినడం అంత మంచిది కాదు.అది ట‌మాటాల‌కు కూడా వ‌ర్తిస్తుంది.

మితంగా ట‌మాటాల‌ను వాడితే.ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube