శ్రావణ సోమవారం ఆ పరమశివుడికి ఏ విధంగా పూజలు చేయాలి!

తెలుగు ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం ప్రారంభమైంది.ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఆ పరమ శివునికి ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.

 How To Worship Lord Shiva On Shravan Monday, Shrava Monday, Worship, Hindu Beliv-TeluguStop.com

సోమవారం శివ భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని ఉపవాస దీక్షలతో స్వామివారి పూజలో పాల్గొంటారు.ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం పరమేశ్వరుడికి పూజ చేయడం వల్ల జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

మరి ఎంతో పవిత్రమైన శ్రావణ సోమవారం రోజు స్వామివారికి ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు పరమశివుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు.

ఈ క్రమంలోనే భక్తులు ఉపవాసంతో ఆలయాలకు వెళ్లి పరమేశ్వరుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే అభిషేక ప్రియుడు అయినటువంటి పరమశివుడికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మనకు ఆరోగ్యం సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

రుణబాధలు, కష్టాలలో ఉన్నవారు స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల కష్టాల నుంచి బయట పడవచ్చు.ఇక సంతానం కోసం తపించేవారు పరమశివుడికి పాలతో అభిషేకం చేస్తూ పూజలు చేయాలి.

ఈ విధంగా స్వామివారికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో పూజించాలి.ఈ క్రమంలోనే శివుడికి సహస్ర నామాలను చదువుతూ పాలలో చక్కెర కలిపి వాటితో అభిషేకం చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది.పూజ అనంతరం స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటివి సగ్గుబియ్యంతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుందని చెప్పవచ్చు.ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం పరమేశ్వరుడికి పూజలు చేయటం వల్ల సకల సంతోషాలు కలుగుతాయి.

How To Worship Lord Shiva On Shravan Monday, Shrava Monday, Worship, Hindu Belives, Lord Shiva - Telugu Hindu, Worshiplord, Lord Shiva, Shrava Monday, Worship

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube