నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!

సాధార‌ణంగా అంద‌రూ మార్నింగ్ వేక‌‌ప్ అద్భుతంగా ఉండాల‌ని కోరుకుంటారు.కానీ, చాలా మందికి కోరుకున్న‌దాని కంటే భిన్నంగా ఉంటుంది.

 How To Wake Up Happy In The Morning! How To Wake Up, Happy Wake Up, Morning Wake-TeluguStop.com

మార్నింగ్‌ బెడ్‌పై నుంచి అంత త్వ‌ర‌గా లెగాల‌నిపించ‌దు.బ‌ద్ధ‌కంగా ఉంటుంది.

త‌లంతా బ‌రువుగా అనిపిస్తుంది.ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌ను చాలా మంది ఉద‌యాన్నే ఎదుర్కొంటారు.

అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు దూరంగా.వేక‌ప్ స‌మ‌యంలో యాక్టివ్‌గా ఉండాలి అని కోరుకునే వారు ఖ‌చ్చితంగా నైట్ నిద్రంచే ముందు కొన్ని ప‌నులు చేయాల్సి ఉంటుంది.

మ‌రి ఆ ప‌నులు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది నిద్ర‌పోయే ముందు ఆల్క‌హాల్‌ను సేవిస్తుంటారు.

కానీ, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది.దాంతో ఉద‌యానికి త‌ల తిర‌గ‌డం, త‌ల నొప్పి, క‌ళ్లు ఉబ్బిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అందువ‌ల్ల‌, నైట్ నిద్రించే ముందు ఆల్క‌హాల్‌ను ఎవైడ్ చేయండి.ఫ‌లితంగా, ఉద‌యానికి ఫ్రెష్ అండ్ యాక్టివ్‌గా ఉంటాయి.

అలాగే నైట్ నిద్రించే ముందు ఉప్పు అధికంగా ఆహారం, ఆయిల్ ఫుడ్, పాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంటాలి.

Telugu Happy Wake, Tips, Wake, Latest-Telugu Health - తెలుగు హె�

వీటి వ‌ల్ల గ్యాస్‌, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు మంట వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డి.నిద్ర‌కు భంగం క‌లుగుతుంది.దాంతో ఉద‌యానికి నీర‌సంగా మారిపోతుంటారు.

ఇక వారానికి ఒకసారైనా బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాష్ చేసుకోవాలి.లేదంటే, వాటిపై ఉండే డ‌స్ట్ మీ శ‌రీరానికి ప‌ట్టేసి.

అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ఇటీవ‌ల కాలంలో చాలా మంది నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ.

స్మార్ట్‌ఫోన్ల‌లో మునిగిపోతున్నారు.దాంతో నిద్ర చాల‌క‌.ఉద‌యానికి డ‌ల్‌గా, నీర‌సంగా మారిపోతుంటారు.అందువ‌ల్ల‌, ఎన్ని ప‌నులు ఉన్నా క‌రెక్ట్ టైమ్‌కు ప‌డుకుంటే.ఉద‌యం వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది.

అలాగే చాలా మంది చేసే పొర‌పాటు.

నైట్ మేకప్ తీయ‌కుండా అలానే నిద్రించ‌డం.ఇలా చేయ‌డం వ‌ల్ల ఉద‌యానికి చ‌ర్మం డ్రైగా మార‌డంతో పాటు మొట‌మ‌లు, మ‌చ్చ‌ల స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

కాబ‌ట్టి, మీరు ఎంత మేక‌ప్ వేసుకున్నా.ప్ర‌తి రోజు నిద్రించే ముందు దాన్ని రిమూవ్ చేసి నైట్ క్రీమ్స్ అప్లై చేసుకోవాలి.దాంతో మీ ముఖం ఉద‌యానికి కాంతివంతంగా మారుతుంది.ఫ‌లితంగా మీలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube