సుగంధ ద్రవ్యాల్లో రారాజు అయిన మిరియాలు గురించి పరిచయాలు అవసరం లేదు.ఘాటైన రుచి, సువాన కలిగి ఉండే మిరియాలను తరచూ వంటల్లో వాడుతూనే ఉంటారు.
ముఖ్యంగా నాన్ వెజ్ కూరల్లోనూ, బిర్యానీల్లోనూ మిరియాల పొడి వేస్తే ఆహా.ఆ రుచే వేరు.ఇక రుచిలోనే కాదు.మిరియాల్లో బోలెడన్ని ఔషద గుణాలు కూడా దాగి ఉన్నాయి.విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు మిరియాల్లో ఉంటాయి.
అందుకే మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు.
అయితే మిరియాలు ఆరోగ్యానికి ఎంత మంచి చేసినప్పటికీ.అతిగా తీసుకుంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారణంగా గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారించడంలో మిరియాలు గ్రేట్‌గా సహాయపడతాయి.కానీ, అదే మిరియాలు అతిగా తీసుకుంటే.
ఆ సమస్యలు మరింత రెట్టింపు అవుతాయి.
అలాగే మిరియాలను అతిగా తీసుకోవడం వల్ల చర్మం తరచూ పొడి బారి పోతుంటుంది.ఒక వేళ డ్రై స్కిన్‌తో బాధ పడే వారు మిరియాలు తీసుకుంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది.మిరియాలు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్ కూడా ఉంటుంది.
ఇక గర్భిణీ స్త్రీలకు కూడా మిరియాలు ఏ మాత్రం మంచివి కావు.
ప్రెగ్నెన్సీ సమయంలో మిరియాలు తీసుకుంటే.
శరీర వేడికి కారణం అవుతాయి.దాంతో రక్తస్రవం, కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాలిచ్చే తల్లులు కూడా మిరియాలకు దూరంగా ఉండాలి.ఇక ఏవైనా వ్యాధులకు మందులు, మూలికలు వాడే వారు కూడా మిరియాలను అతిగా తీసుకోరాదు.
అలా చేస్తే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.