డెంగ్యూ జ్వరం వస్తే బొప్పాయి ఆకులను ఎలా ఉపయోగించుకోవాలి ?  

How To Use Papaya Leaves In Dengue Fever -

వర్షాకాలం వచ్చేసింది.ఈ కాలంలో భారి వర్షాలు, బురద, ఆగిపోయిన నీళ్ళు, దోమలు .

How To Use Papaya Leaves In Dengue Fever

ఇవన్ని చాలా కామన్.దోమలకి బాగా ఇష్టమైన సీజన్ ఇది.అందులోనూ డెంగ్యూ మోసుకొచ్చే దోమలకి ఇంకా ఇష్టం.డెంగ్యూ జ్వరం బారిన పడి వేలమంది హాస్పిటల్స్ లో పడుతుంటారు.

కొంతమందితో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఈ జ్వరం ముదిరేదాకా సరైన చికిత్స మొదలుపెట్టారు.అలాంటివారికి చెప్పేదేమీటంటే, డెంగ్యూ లక్షణాలు కనిపించగానే మొదట బొప్పాయి చెట్టు ఎక్కడ ఉందో వెతకండి.

డెంగ్యూ జ్వరం వస్తే బొప్పాయి ఆకులను ఎలా ఉపయోగించుకోవాలి -Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఎందుకంటే ఈ టైంలో బొప్పాయి చేసే సాయం అలాంటిది ఇలాంటిది కాదు.బొప్పాయి ఆకులు డెంగ్యూ ముదరకుండా అడ్డుకుంటాయి.

జ్వరం ప్రభావాన్ని తగ్గిస్తాయి.

మీరు చేయాల్సింది ఏమిటంటే, మంచి వాతావరణంలో పెరిగిన బొప్పాయి చెట్టు నుంచి ఆకులని తీసుకోండి.

దుమ్ముధూళి పోయేలా నీటితో శుభ్రం చేయండి.ఆ తరువాత బాగా రుబ్బండి.

అది పేస్టులా తయారవ్వాలి.ఇప్పుడు రసం వడబోయండి.

రసాన్ని కాసేపు ఫ్రిడ్జిలో ఉంచి, ఉప్పు, చక్కర ఏమి కలపకుండా తాగండి.రుచి కాదు మీకు కావాల్సింది, ఆరోగ్యం.

అయితే ఏ వయసు వారు ఎంత రసం తాగాలి అనే అనుమానం మీకు ఉండొచ్చు.పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి అయితే కేవలం 25 మిల్లి లీటర్ల రసం తాగించాలి.ఎనిమిది గంటల గ్యాప్ ఇస్తూ రోజుకి రెండుసార్లు తాగించాలి.ఇక వయసులో ఉన్నవారు 50 మిల్లి లీటర్ల రసం అదే ఎనిమిది గంటల గ్యాప్ ఇస్తూ రోజుకి రెండు సార్లు తాగొచ్చు.

అయితే బొప్పాయి ఆకుల రసం వలన కొందరికి వాంతులు అవుతాయి.కొందరికి అస్సలు పడదు ఇది.కాబట్టి మోతాదు గురించి, తీసుకోవాలా వద్దా అనే విషయం మీద ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ తో మాట్లాడాలి.
ఇక అసలు డౌటు ఏంటంటే, బొప్పాయి ఆకుల రసం తాగడం వలన డెంగ్యూ జ్వరం పూర్తిగా తగ్గుతుందా లేదా ? నిజం చెప్పాలంటే ఇది పూర్తీ పరిష్కార మార్గం కాదు.బొప్పాయి రసం ప్లేట్లేట్ లను పెంచుతుంది.డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లేట్ల సంఖ్య చాలా ముఖ్యం.అంటే డెంగ్యూ జ్వరం ఇంకా పెరగకుండా, ఆ జ్వరం కాస్త పెరిగి పెద్దగా డెంగ్యూ హేమోర్హజిక్ గా మారకుండా ఆపుతుంది బొప్పాయి ఆకుల రసం.అంతేతప్ప, పూర్తిగా నయం చేయదు.ప్రభావాన్ని తగ్గిస్తుంది, ఎదుగుదలని సాధ్యమైనంతవరకు ఆపుతుంది లేదా నెమ్మదింపజేస్తుంది.అందుకే కేవలం బొప్పాయి ఆకుల మీద ఆధారపడకూడదు.చికిత్స తీసుకుంటూనే ఈ రసం తాగాలి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

How To Use Papaya Leaves In Dengue Fever Related Telugu News,Photos/Pics,Images..

footer-test