జుట్టుకు హెన్నా(గోరింటాకు)తో ఉన్న అసాధారణ ఉపయోగాలు

ఔషధ మొక్క అయిన హెన్నా(గోరింట) ను మెహందీ, పన్వర్,సుది అని పిలుస్తారు.ఈ మొక్క అనేక శాఖలతో మధ్య తరహా పొదగా పెరుగుతుంది.

 How To Use Henna For Hair Growth Details, Henna, Gorintaku,hair Growth, Hair Gro-TeluguStop.com

ఈ మూలికను అనేక ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.ఇక్కడ హెన్నా యొక్క కొన్ని ఉపయోగాలు ఉన్నాయి.

శీతలీకరణ ఏజెంట్

హెన్నా ఒక గొప్ప శీతలీకరణ ఏజెంట్ అని చెప్పవచ్చు.గీతలు మరియు కాలిన గాయాలకు ఉపశమనాన్ని ఇస్తుంది.అధిక జ్వరం లేదా వేడి వలన కలిగిన అలసట ఉన్నప్పుడు ఉష్ణోగ్రతను తగ్గించటానికి దీనిని ఒక సహజమైన ఇంటి హెర్బ్ గా ఉపయోగించవచ్చు.

తలనొప్పి

సూర్యకాంతి వేడి వలన వచ్చే తలనొప్పిని తగ్గించటానికి గోరింట పువ్వులను ఉపయోగించవచ్చు.గోరింట పువ్వులను క్రష్ చేసి వెనిగర్ లో కలిపి పేస్ట్ చేసి నుదుటి మీద రాయాలి.అలాగే హెన్నా ప్లాస్టర్ ని కూడా ఉపయోగించవచ్చు.

బట్టతల చికిత్స

గోరింట ఆకులను బట్టతల చికిత్సలో ఉపయోగించవచ్చు.ఆవాల నూనెలో కొన్ని గోరింట ఆకులను వేసి మరిగించి ఆ నూనెను తల మీద చర్మం మీద మసాజ్ చేయాలి.ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది.ఒక పాన్ లో 250 గ్రాముల (8 ఔన్సులు) ఆవాల నూనె మరియు గోరింటాకు 50-60 గ్రాములు (1-2 ఔన్సులు) వేసి మరిగించాలి.

ఈ నూనెను వడకట్టి ఒక సీసాలో నిల్వ చేయాలి.ఈ నూనెను క్రమం తప్పకుండా జుట్టుకు రాస్తే కావలసినంత జుట్టు ఉత్పత్తి పెరుగుతుంది.

కామెర్లు

కామెర్లు మరియు కాలేయ వ్యాకోచం వంటి కాలేయ వ్యాధుల చికిత్సకు గోరింటాకు మొక్క యొక్క బెరడును ఉపయోగించవచ్చు.గోరింట పొడిని 1 నుంచి 5 డెసి గ్రాముల మోతాదులో తీసుకోవాలి.

ఇది కాలేయ సంబంధ ఇతర పరిస్థితులకు కూడా సహాయపడుతుంది.

How To Use Henna For Hair Growth Details, Henna, Gorintaku,hair Growth, Hair Growth Tips, Telugu Health Tips, Henna For Hair, Bald Head, Head Ache, Cooling Agent, - Telugu Bald, Gorintaku, Tips, Ache, Henna, Telugu Tips

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube