అందాన్ని రెట్టింపు చేసే జామ ఆకులు.. ఎలాగంటే?

అందంగా, ఆక‌ర్ష‌నీయంగా క‌నిపించాల‌ని కోరుకోని అమ్మాయి ఉంటుందా అంటే.ఎవ్వ‌రైనా నో అనే అంటారు.

 How To Use Guava Leaves For Glowing Skin?? Guava Leaves For Glowing Skin, Guava-TeluguStop.com

అమ్మాయిలే కాదు.అబ్బాయిలు కూడా అందంగా క‌నిపించాల‌ని ఆర‌ట‌ప‌డుతుంటారు.

అందుకోసం ఎన్నో చిట్కాలను ఉపగిస్తారు.బ్యూటీపార్లర్ల చుట్టూ తిరిగి ఎంతో ఖర్చు పెడుతుంటారు.

మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీములు కొనుగోలు చేసి వినియోగిస్తారు.అయితే వాస్త‌వానికి మార్కెట్ లో దొరికే ప్రతీ ఉత్పత్తిలో రసాయనిక పదార్థాలు ఉంటాయి.

ఇవి చ‌ర్మాన్ని అందంగా.అంద‌హీనంగా చేస్తాయి.అందుకే సహజసిద్ద పద్ధతులతోనే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుప‌రుచుకోవాలి.అయితే అందాన్ని రెట్టింపు చేసేవాటిలో జామ ఆకులు కూడా ఒక‌టి.అవును! జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్క‌లంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డ‌ట‌మే కాదు.అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయి.మ‌రి జామ ఆకుల‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Skin, Guava, Guava Skin, Latest-

జామ ఆకులను తీసుకుని నీటితో కలిపి మరిగించాలి.ఈ నీటిని ముఖంపై అప్లై చేసి.ఆరిన త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తూ ఉంటే.ముడుతలను, సన్నటి గీతలను త‌గ్గించి చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మారుస్తుంది.అలాగే జామాకుల‌ను తీసుకుని మొత్త‌గా పేస్ట్ చేసి.

కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

ఆరిన త‌ర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తిరోజు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, డెడ్ సెల్ ను తొలిగిస్తుంది.

జామాకుల‌ను పేస్ట్ చేసి.అందులో కొద్దిగా రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి ముఖానికి ప‌ట్టించాలి.

పావు గంట తర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

అలాగే ముఖంపై మంట, దురద వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube