జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి ఆముదాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా?  

  • పూర్వ కాలం నుండి ఆముదాన్ని సౌందర్య సాధనలలో వాడుతున్నారు. ఆముదంలో బ్యాక్టీరియా, ఫంగల్ వ్యతిరేక లక్షణాలు, విటమిన్ ఇ, ఖనిజలవణాలు, ఒమేగా 6, 9 ఫ్యాటీయాసిడ్లు, ప్రొటీన్లు ఉండటం వలన జుట్టు రాలటాన్ని అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. జుట్టును మృదువుగా,జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఆముదాన్ని ఎలా ఉపయోగిస్తే జుట్టు రాలకుండా బాగా ఒత్తుగా పెరుగుతుందో తెలుసుకుందాం.

  • ఒక స్పూన్ ఆముదంలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి 2 గంటల పాటు ఆలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గిపోతుంది.

  • -

  • ఒక స్పూన్ ఆముదం నూనెలో ఒక స్పూన్ ఆవనూనె కలిపి తలకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.

  • ఒక స్పూన్ ఆముదంలో ఒక స్పూన్ బాదాం నూనెను కలిపి జుట్టుకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి అరగంట తర్వాత తెలిపాయి షాంపూతో తలస్నానము చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. బాదాం నూనె పాడయిన జుట్టును రిపేర్ చేయటంలో బాగా పనిచేస్తుంది.