చిట్లిన జుట్టుకు అద్భుతమైన అవకాడో ప్యాక్స్       2018-06-09   23:23:40  IST  Lakshmi P

సాధారణంగా జుట్టు చివర్లు చిట్లినప్పుడు కొంచెం జుట్టును కట్ చేస్తూ ఉంటాం. ఇలా చేయటం వలన సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది. కానీ పూర్తిగా తగ్గదు. అందువల్ల కొన్ని సహజమైన చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు. ఈ చిట్కాలతో ముఖ్యంగా అవకాడో అద్భుతంగ పనిచేస్తుంది. ఇప్పుడు అవకాడోతో చిట్లిన జుట్టు సమస్యను ఎలా అధికమించవచ్చో తెలుసుకుందాం.

బాగా పండిన అరటిపండు గుజ్జులో ఒక అవకాడో పేస్ట్, 4 స్పూన్ల రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

మూడు స్పూన్ల బాదాం ఆయిల్ లో రెండు స్పూన్ల అవకాడో ఆయిల్ ని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి.

బాగా పండిన బొప్పాయి గుజ్జులో ఒక అవకాడో పేస్ట్ కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా నెలలో రెండు సార్లు చేయాలి.

రెండు స్పూన్ల అవకాడో పేస్ట్ లో రెండు స్పూన్ల తేనే కలిపి తలకు పట్టించి 40 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి ఒక సారి చేయాలి.