బరువును తగ్గించటంలో వాము చేసే మాయ       2018-05-20   22:30:21  IST  Lakshmi P

శరీరంలో పెరిగిన కొవ్వును,బరువును తగ్గించుకోవాలంటే చాలా కష్టమైన పని. కఠినమైన డైట్,వ్యాయామాలు చేసిన బరువు తగ్గటం అనేది చాలా కష్టమైన పని. ప్రతి రోజు ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఉంటే క్రమంగా బరువు తగ్గుతాం. అయితే వామును ఇప్పుడు చెప్పే పద్దతిలో వాడితే 15 రోజుల్లో 5 కేజీల బరువును సులభంగా తగ్గవచ్చు. వాములో అధికంగా ఉండే థైమల్‌ అనే రసాయనం బ్యాక్టీరియా, ఫంగల్‌ వ్యాధుల్ని నిరోదించటంలో సహాయాపడుతుంది. అంతేకాక యాంటీ సెప్టిక్‌గానూ పని చేస్తుంది.

వాములో అనేక విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.ఇప్పుడు వామును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇన్ని పోషకాలు ఉన్న వాము బరువును తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. అయితే వామును తీసుకోవటానికి కూడా ఒక పద్దతి ఉంది. ఇప్పుడు ఆ పద్దతి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ వామును ఒక గ్లాస్ నీటిలో రాత్రి అంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాముతో సహా నీటిని మరిగించాలి. మరిగిన నీటిని వడగట్టి త్రాగాలి. అయితే ఈ నీటిని ఉదయం పరగడుపున త్రాగాలి. ఈ వాము నీటిని త్రాగక గంట వరకు ఏమి తినకూడదు. ఈ విధంగా ప్రతి రోజు చేస్తే బరువు ఖచ్చితంగా తగ్గుతారు. ఇంకా తొందరగా మంచి ఫలితం రావాలంటే మధ్యాహ్నం భోజనం చేయటానికి గంట ముందు కూడా త్రాగాలి. ఇలా ఉదయం,మధ్యాహ్నం క్రమం తప్పకుండా త్రాగితే 15 రోజుల్లో ఖచ్చితంగా 5 కేజీల బరువు తగ్గుతారు.