మొబైల్ తో పాటే వచ్చిన యాప్స్ ని ఎలా డిలీట్ చేయాలి ?   How To Uninstall Pre Installed Apps From Your Mobile ?     2017-07-17   06:30:29  IST  Raghu V

ఎన్ని యాప్స్ ఎక్కువ ఉంటే, ఫోన్ అంత నెమ్మదిస్తుంది. ప్రసుతం ఒక్కో మొబైల్ ఫోన్ లో సగటున 30 యాప్స్ వాడుతున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అన్ని యాప్స్ మనకు అవసరమా ? మనమైతే మనకు అవసరమైన యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకుంటాం. కాని కొన్ని యాప్స్ ని మొబైల్ కంపెనీలే మనమీదకి రుద్దుతాయి. వాటిని సిస్టం యాప్స్ లేదా ప్రీ ఇంస్తాల్ద్ యాప్స్ అని అంటాం. ఇందులో కొన్ని పనికొచ్చేవి ఉంటాయి, మరికొన్నిటితో మనకు అసలు అవసరమే ఉండదు. కాని వాటిని అన్ ఇన్స్టాల్ చేయలేం. అలాంటి ఆప్షన్ ఇవ్వదు మన ఫోన్. ఎందుకు అంటే ప్రీ ఇంస్తాల్ద్ యాప్స్ ఈ మొబైల్ కంపెనీలకి డబ్బులు చెల్లిస్తాయి. అలా వారు వ్యాపార లాభాల కోసం మన మీద ఈ యాప్స్ ని రుద్దుతారు.

వీటి వలన చాలా స్పేస్ పోతుంది. ఒక్కోసారి కొత్త యాప్స్ కి స్పేస్ లేక, మన వాడే యాప్స్ ని తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఈ సిస్టం ఇచ్చిన అనవసరపు యాప్స్ ని, ప్రమోషనల్ యాప్స్ ని, అదే ప్రీ ఇంస్తాల్ద్ యాప్స్ ని మనం మొబైల్ బయటకి తోయలేమా ? వాటిని డిలీట్ చేసే మార్గమే లేదా ? ఎందుకు ఉండదు. ఉంది .. కాని ఆ ఆప్షన్ మొబైల్ ఇవ్వదు. మనమే మరో యాప్ సహాయంతో వాటి పీడా వదిలించుకోవాలి. అలాంటి ఒక యాప్ పేరే Titanium Backup Root. ఈ యాప్ సహాయంతో మీరు సిస్టం యాప్స్ ని తీసేయొచ్చు. ఎలా చేయాలి అంటే …

ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ పూర్తవగానే పర్మిశన్స్ ఇవ్వండి. అనుమతులు ఇచ్చిన తరువాత మీ మొబైల్ లో ఉన్న అన్ని యాప్స్ ఓ చోట దర్శనమిస్తాయి. అందులో సిస్టం ద్వారా వచ్చిన యాప్స్ రెడ్ కలర్ టెక్స్ట్ లో ఉంటే, మీరే డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇప్పుడు ఆ రెడ్ కలర్ టెక్స్ట్ తో ఉన్న సిస్టం యాప్స్ లో, ఏదైతే మీకు అవసరం లేదో, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు బ్యాక్ అప్ తో పాటు అన్ ఇన్స్టాల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ యాప్ డేటా బ్యాక్ అప్ మీకు అవసరం అనుకుంటే బ్యాక్ అప్ చేయండి ముందు. లేదంటే డైరెక్ట్ గా అన్ ఇన్స్టాల్ మీద నొక్కేయండి. యాప్ డిలీట్ అయిపోతుంది. అయితే జాగ్రత్త .. అండ్రాయిడ్ సింబల్ తో కనిపించే యాప్స్ తో జాగ్రత్త. అవి మీ సిస్టం ని రన్ చేసేవి. ప్రమోషనల్ యాప్స్ మాత్రమే డిలీట్ చేయండి.