సీపీఎస్ రద్దు హామీపై పవన్‌ను నమ్మేదెలా?

ఏపీ రాజకీయాలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ కీలకంగా మారుతుందని అందరూ భావిస్తున్నారు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ పర్యటించినా వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని స్టేట్‌మెంట్ ఇస్తూ పొత్తు రాజకీయాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు.

 How To Trust Pawan On Cps Cancellation Guarantee Janasena Party, Pawan Kalyan, Cps, Andhra Pradesh, Ap Poltics , Ys Jagan , Employees , Tdp Party , Chandra Babu Naidu-TeluguStop.com

ఓ స్ట్రాటజీ ప్రకారమే ఆయన పొత్తుల గురించి మాట్లాడుతూ ఇతర విషయాల గురించి ప్రస్తావించకుండా.వైసీపీని మానసికంగా బలహీనపర్చడానికి దీనిపై మాట్లాడుతున్నారు.

అయితే కేవలం పొత్తుల గురించి మాత్రమే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కర్ర విడిచి సాము చేస్తున్నారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అసలు ఎన్నికలకు సంబంధించి పవన్ వ్యూహమేంటో తెలియడం లేదని కూడా టాక్ వినిపిస్తోంది.

 How To Trust Pawan On CPS Cancellation Guarantee Janasena Party, Pawan Kalyan, Cps, Andhra Pradesh, Ap Poltics , Ys Jagan , Employees , Tdp Party , Chandra Babu Naidu -సీపీఎస్ రద్దు హామీపై పవన్‌ను నమ్మేదెలా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే జనసేన వరకు చూసుకుంటే ఆ పార్టీకి అభిమానులే తప్ప గ్రౌండ్ లెవల్లో బలం లేదని.గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి ఇది కూడా ఓ కారణమని ఎత్తి చూపిస్తున్నారు.

Telugu Andhra Pradesh, Ap Poltics, Chandra Babu, Employees, Janasena, Pawan Kalyan, Tdp, Ys Jagan-Latest News - Telugu

అయితే పవన్ ప్రజల్లోనే ఉండాలంటే వచ్చే రెండేళ్లు సినిమాలపై దృష్టి మళ్లించకుండా విజిటింగ్ లీడర్, పెయిడ్ ఆర్టిస్ట్ అనే వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.కేవలం గుర్తుకువచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయడం తగదని హితవు పలుకుతున్నారు.గతంలో తనకు అధికారం అక్కర్లేదన్న పవన్ కళ్యాణ్.ఇప్పుడు ప్రజలు అధికారం ఇస్తే తీసుకుంటానని ఎలా మాట్లాడతారని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.ముఖ్యంగా ఉద్యోగులకు సీపీఎస్ విషయంలో జగన్ తప్పిన మాటను తాను నెరవేరుస్తానని పవన్ చెప్తున్నారని.అయితే ఎలా చేస్తానో ఆయన చెప్పలేకపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

తలపండిన రాజకీయ నేత చంద్రబాబు కూడా గతంలో సీపీఎస్ రద్దు చేయలేకపోయారని.మరి పవన్ హామీలకే పరిమితం కాకుండా సీపీఎస్ రద్దు ఎలా సాధ్యమో వివరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేవలం హామీ ఇచ్చినంత మాత్రాన పవన్‌ను ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube