నుదురుపై ఉన్న ముడతలను తొలగించుకోవడానికి అద్భుతమైన పాక్స్     2018-07-26   10:10:03  IST  Laxmi P

నుదురుపై ముడతలు,ఫైన్ లైన్స్ వచ్చాయంటే వృద్దాప్య లక్షణాలు వచ్చినట్టే. ఇవి ముఖ అందాన్ని దెబ్బతీస్తాయి. అయితే వీటిని తొలగించుకోవడానికి ఖరీదైన కాస్మొటిక్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ముడతలు తగ్గించుకోవటానికి అద్భుతమైన పాక్స్ గురించి తెలుసుకుందాం.

బొప్పాయి

బొప్పాయిలో పెపైన్ మరియు ఇతర ఎంజైమ్స్ సమృద్ధిగా ఉండుట వలన నుదురుపై ముడతలను,ఫైన్ లైన్స్ ని సులభంగా తగ్గిస్తుంది. వృద్దాప్య లక్షణాలను కూడా తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. బాగా పండిన బొప్పాయి గుజ్జును ముడతలు ఉన్న నుదురు భాగంపై రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

How To Treat Wrinkles On Forehead-

How To Treat Wrinkles On Forehead

గుడ్డు తెల్లసొన

గుడ్డు తెల్లసొనలో యాస్ట్రిజెంట్ లక్షణాలు ఉండుట వలన ముడతలను సమర్ధవంతంగా తొలగిస్తుంది. ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముడతలు ఉన్న నుదురు భాగంపై రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ తొక్కల పొడి

ఆరెంజ్ తొక్కల పొడి కూడా ముడతలను నివారించడంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడిలో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముడతలు ఉన్న నుదురు భాగంపై రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అనాస పండు

అనాస పండులో బ్రొమిలిన్ మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన ముడతలు,ఫైన్ లైన్స్ తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అనాస పండు జ్యుస్ లో కాటన్ బల్ ముంచి ముడతలు ఉన్న నుదురు భాగంపై రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.