తల మీద చర్మం మీద మొటిమలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు  

How To Treat Scalp Pimples - Telugu Health Tips, Pimples, Scalp, Skin, Treatment For Hair And Scalp

మొటిమలు అనేవి శరీరం, తల మీద చర్మం మరియు శరీరం యొక్క అనేక బాగాలపై కనపడతాయి.ఈ సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ కనపడుతుంది.

How To Treat Scalp Pimples

జుట్టు మీద చనిపోయిన చర్మ కణాలు మరియు సిబం కలిసి తల మీద చర్మం మీద చర్మ రంద్రాలను మూసివేయటం వలన మొటిమలు ఏర్పడతాయి.ఈ మొటిమలకు హార్మోన్ల మార్పులు,అనారోగ్యకరమైన ఆహారం, అలెర్జీ, ఆర్ద్ర పరిస్థితులు, కాలుష్యం మరియు కొన్ని రసాయనాల కారణంగా ఏర్పడతాయి.

అలాగే ఈ సమస్యకు ఒత్తిడి, అలసట మరియు నిస్పృహ కూడా కారణం అవుతాయి.ఈ సమస్యను వదిలించుకోవటానికి కొన్ని సహజ నివారణలు మరియు నయం చేసే ప్రక్రియను వేగవంతం చేయటానికి సాధారణ చిట్కాలు ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1.టీ ట్రీ ఆయిల్:


టీ ట్రీ ఆయిల్ మొటిమలు మరియు ఇతర చర్మ సమస్యలను సమర్థవంతముగా నివారిస్తుంది.ఈ నూనెలో ఏంటి సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన చర్మ రంద్రాలను డ్రై గా చేసి మొటిమలను తగ్గిస్తుంది.

 • రెండు స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనెలో 5 చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలపాలి.ఈ మిశ్రమంతో తలకు మసాజ్ చేసి రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 • మనం రెగ్యులర్ గా వాడే షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలిపి జుట్టు శుభ్రం చేయటానికి ఉపయోగించాలి.
 • కాటన్ బాల్ పై కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని వేసి ప్రభావిత ప్రాంతంలో రుద్దాలి.

  ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.ప్రతి రోజు ఈ విధంగా రెండు సార్లు చేయాలి.


2.పసుపు


పసుపు అనేది మొటిమల చికిత్సలో మరొక అద్భుతమైన పదార్దం అని చెప్పవచ్చు.పసుపులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.

 • ఒక స్పూన్ కొబ్బరి నూనెలో పావు స్పూన్ పసుపు వేసి పేస్ట్ గా తయారుచేయాలి.

  ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

 • డాక్టర్ సలహాతో రోజుకి రెండు 450 mg కర్కుమిన్‌ మాత్రలను వేసుకోవచ్చు.


3.ఆపిల్ సైడర్ వినెగర్


ఆపిల్ సైడర్ వినెగర్ కూడా నెత్తిమీద మొటిమల మీద పోరాటం చేయటానికి సహాయపడుతుంది.

దీనిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు జుట్టు గ్రీవములో మొటిమలకు కారణం అయిన బ్యాక్టీరియా మరియు నూనెను క్లియర్ చేయటంలో సహాయం చేస్తాయి.అంతేకాక జుట్టు యొక్క pH సంతులనం చేసి జుట్టు బ్రేక్ అవుట్స్ ని నిరోదిస్తుంది.

 • గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలపాలి.ఈ మిశ్రమాన్ని తల మీద రాసి 5 నిముషాలు అయ్యాక తలస్నానం చేయాలి.షాంపూ చేసిన ప్రతి సారి ఈ విధంగా చేయాలి.
 • ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలిపి రోజులో రెండు సార్లు త్రాగాలి.


4.కలబంద


తల మీద చర్మం మీద మొటిమలను తొలగించటానికి కలబంద బాగా సహాయపడుతుంది.జుట్టు యొక్క pH సంతులనం కొనసాగించటానికి మరియు మొటిమలకు కారణం అయిన బాక్టీరియా చంపడానికి సహాయపడుతుంది.కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, అనస్తీషియా, క్రిమినాశక మరియు యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండుట వలన జుట్టు మరియు చర్మ సమస్యల్లో సహాయపడుతుంది.

 • కలబంద జెల్ ని ప్రభావిత ప్రాంతంలో ప్రతి రోజు రెండు సార్లు రాయాలి.
 • అరకప్పు కలబంద జెల్ లో అరచెక్క నిమ్మరసం కలపాలి.

  ఈ మిశ్రమాన్ని తడి తల మీద రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు