ద్రాక్ష సాగులో నల్ల బూజు ను నివారించేందుకు చర్యలు..!

ద్రాక్ష సాగులో( Grapes Cultivation ) వచ్చే నల్ల బూజు ఓ ఫంగస్ ( Fungus ) వల్ల సోకుతుంది.ఈ నల్ల బూజు( Grey Mould ) సోకితే ద్రాక్ష పండ్లు చెడిపోవడం, క్షీణించడం జరుగుతుంది.

 How To Treat Grey Mould In Grapes Details,  Grey Mould ,grapes, Grapes Cultivati-TeluguStop.com

ఈ నల్ల బూజు గాలి, నేల, నీరు ద్వారా పంటకు వ్యాపించింది.ఈ నల్ల బూజు అనేది కుళ్ళిపోతున్న పదార్థాలపై జీవిస్తుంది.

ఇక తేమశాతం అధికంగా ఉండే ప్రాంతాలలో కూడా ఈ నల్ల బూజు చేరి త్వరగా వ్యాప్తి చెందుతుంది.

మొక్కలపై నీటిలో తడిచినట్లు పోలుసులు ఏర్పడి, చారలుగా మారితే ఈ నల్లబోజు సోకినట్టే.

తర్వాత ద్రాక్ష పండ్ల పై ఉబ్బిన గాయాలు కనిపిస్తాయి.భూమిలో కనుక ఈ నల్ల బూజు ఉంటే విత్తనాలు మొలకెత్తకుండానే కుళ్లిపోతాయి.

ఇక లేత మొక్కలు వేళ్ళతో సహా మొత్తం కుళ్ళిపోతాయి.

Telugu Agriculture, Farmers, Fertilizers, Fungus, Grape Diseases, Grape, Grapes,

ద్రాక్ష తోటలను వివిధ రకాల తెగులు నుండి సంరక్షించుకోవాలంటే రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి కచ్చితంగా పంట మార్పిడి చేయాలి.నీరు నిల్వ ఉండకుండా పొలాన్ని సమాంతరంగా ఏర్పాటు చేసుకోవాలి.తడి వాతావరణం ఉన్న సమయంలో పంటను కోయకూడదు.

ఉష్ణోగ్రత కూడా చాలా అధికంగా ఉండకూడదు.పంట కోత తర్వాత పంట అవశేషాలను పొలం నుంచి తొలగించి కాల్చి నాశనం చేసేయాలి.

Telugu Agriculture, Farmers, Fertilizers, Fungus, Grape Diseases, Grape, Grapes,

సేంద్రీయ పద్ధతిలో ముందుగా నీటిలో వేపచెక్కలు వేసి 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేయాలి.అందులో 60 నిమిషాల పాటు విత్తనాలను నానబెట్టాలి.ఇక రసాయన పద్ధతిలో అయితే మాంకొజెబ్ బాగా తడపాలి.కావాలంటే కార్బం డిజమ్, మాంకోజెబ్ ల మిశ్రమంలో తడిపిన మంచి ఫలితం ఉంటుంది.ఇక కలుపు నివారణ చర్యలు చేపడుతూ ఉండాలి.పొలంలో గాలి, సూర్యరశ్మి బాగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

భూమిలో ఉండే తేమశాతాన్ని బట్టి నీటి తడులు అందించాలి.ఇలా అన్ని సస్యరక్షక పద్ధతులు పాటిస్తే ఆరోగ్యమైన, నాణ్యమైన ద్రాక్ష పంట దిగుబడి పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube