యూట్యూబ్ వీడియో చూసి ఏటీఎం చోరీ యత్నం... చివరకు...?

ఈ మధ్యకాలంలో ఏదైనా బయటికి వెళ్లి నేర్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఏదైనా నేర్చుకోవడానికి అయినా సరే యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నాం.అయితే ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఎటిఎం ను కొల్లగొట్టేందుకు కూడా యూట్యూబ్ సహకారం తీసుకొని ఎలా చేయాలో నేర్చుకొని అది అమలు చేయడానికి బయలుదేరాడు.

 Atm Theft, Atm, How To Theft Atm Using Youtube Video, Youtube Video-TeluguStop.com

హర్యానా రాష్ట్రానికి చెందిన సుమిత్ సింగ్ ఏటీఎం ను ఎలా చోరీ చేయాలో యూట్యూబ్ లో శోధించి సరిగ్గా అలాగే తన ప్లాన్ ను అమలు అమలు చేయాలనుకొని చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.

అసలు విషయంలోకి వెళ్తే… చండీగఢ్ సెక్టర్ 26 లో యాక్సిస్ బ్యాంక్ కు సంబంధించిన ఓ ఏటీఎం దగ్గర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సుమిత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు విచారణ చేశారు.

ఆ విచారణలో అతడు సమాధానాలు తడబడుతూ చెప్పడంతో అతని పై అనుమానం రావడంతో, ఏటీఎం దగ్గర పార్కు చేసిన కారు వద్దకు వెళ్లి పరిశీలించగా….అందులో ఏటీఎం ని బద్దలు కొట్టే పరికరాలు అందులో కనపడ్డాయి.

దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ చేపట్టారు.

Telugu Atm Theft, Youtube-

పోలీసుల విచారణ చేపట్టగా అందులో పోలీసులకు విస్తుపోయే సమాధానాలు ఎదురయ్యాయి.సుమిత్ సింగ్ ఇదివరకు రోజుల్లో తాను మెకానిక్ పని చేసేవాడని, తనకి ఆదాయం సరిపోకపోవడంతో ఇంటర్నెట్ లో శోధించి ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలియజేశాడు.డబ్బులు ఉండే ఏటీఎం నే ఏకంగా దోచుకుంటే అధికమొత్తంలో డబ్బులు పొందవచ్చు అని పోలీసులకు తెలియజేశాడు.

పోలీసులు అతన్ని అరెస్టు చేసి అతడు తెచ్చుకున్న కారుతో పాటు ఏటీఎం కార్డులు, సెల్ ఫోన్, ఆక్సిజన్ సిలిండర్, గ్యాస్ కట్టర్ లాంటి పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్ కు తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube