తేన్పులతో ఇబ్బంది ప‌డుతున్నారా? లవంగాలతో చెక్ పెట్టండిలా!

ఆహారం తీసుకున్న త‌ర్వాత తేన్పులు రావ‌డం స‌ర్వ సాధార‌ణం.ఒక‌టి, రెండు సార్లు వ‌స్తే పెద్ద స‌మ‌స్తా కాదు.

కానీ, కొంద‌రిలో ప‌దే ప‌దే తేన్పులు వ‌స్తూనే ఉంటాయి.క‌డుపులో గ్యాస్ ఎక్కువ‌గా చేరిపోవ‌డం వ‌ల్ల తేన్పులు అధికంగా వ‌స్తుంటాయి.

దాంతో చాలా ఇబ్బంది ప‌డి పోతూ ఉంటారు.అదే స‌మ‌యంలో తేన్పుల‌ను ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.

అయితే తేన్పులు వేధిస్తున్న‌ప్పుడు కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే వాటిని నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డొచ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

Advertisement

లవంగాలు తేన్పుల‌కు చెక్ పెట్ట‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.బాగా ఫుడ్ లాగించేసిన త‌ర్వాత తేన్పులు వ‌స్తుంటే ఒక‌టి, రెండు ల‌వంగాల‌ను నోట్లు వేసుకుని బాగా న‌మిలి మింగేలి.

లేదా ఒక క‌ప్పు వాట‌ర్‌లో అర స్పూన్ ల‌వంగాల పొడి వేసి బాగా మ‌రిగించి.భోజ‌నం త‌ర్వాత తీసుకోవాలి.

ఇలా ఎలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

పాల‌తో కూడా తేన్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.అవును, కాచి చ‌ల్లార్చిన పాలను తేన్పులు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు తీసుకుంటే క‌డుపులో ఉండే గ్యాస్ మొత్తం పోయి ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది.దాంతో తేన్పులు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

నిరంతరం తేన్పుల‌కు గుర‌వుతుంటే యాలకులతో తయారు చేసిన టీనే బెస్ట్ అప్ష‌న్ అని చెప్పొచ్చు.వాట‌ర్‌లో టీ పొడితో పాటు యాల‌కుల పొడి వేసి బాగా మ‌రిగించి ఫిల్ట‌ర్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఇందులో రుచికి స‌రిప‌డా తేనె క‌లిపి సేవిస్తే తేన్పులు సుల‌భంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.ఇక నిమ్మ ర‌సం కూడా తేన్పుల‌ను నివారిస్తుంది.

ఒక చిన్న క‌ప్పులో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుని.అందులో ఒక స్పూన్ నిమ్మ ర‌సం యాడ్ చేసి సేవిస్తే.

తేన్పుల నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తాజా వార్తలు