యూట్యూబ్‌లో కావాల్సిన వీడియో పార్ట్ మాత్రమే ఎలా షేర్ చేయాలో తెలుసా..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ విపరీతంగా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు.స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్‌ వీడియోలని బీభత్సంగా చూస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 How To Share Only Required Part Of A Youtube Video Details, Youtube, Video, Share, Social Media, Technology Update, Youtube Video Share, Required Part, Time Stamp Option, Start At, Video Sharing-TeluguStop.com

సినిమాలు, ట్రైలర్లు, పాటలు, నాలెడ్జ్ వీడియోలు ఇలా యూట్యూబ్ లో దొరకని వీడియో అంటూ ఏదీ ఉండదు.అందుకే దీనికి చాలామంది అతుక్కుపోతుంటారు.

అలాగే తమ బంధుమిత్రులతో కొన్ని వీడియోలను షేర్ చేసుకుంటారు.అయితే ఒక్కోసారి కొన్ని వీడియోలు చాలా లెంగ్తీగా ఉంటాయి.

 How To Share Only Required Part Of A Youtube Video Details, YouTube, Video, Share, Social Media, Technology Update, Youtube Video Share, Required Part, Time Stamp Option, Start At, Video Sharing-యూట్యూబ్‌లో కావాల్సిన వీడియో పార్ట్ మాత్రమే ఎలా షేర్ చేయాలో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ వాటిలో కొంత భాగం మాత్రమే చూడదగ్గ కంటెంట్ ఉంటుంది.ఇలాంటి కంటెంట్ వరకు షేర్ చేయాలని చాలామంది భావిస్తుంటారు.

కానీ అది ఎలాగో తెలియక తికమకపడుతుంటారు.మరి యూట్యూబ్ వీడియోలోని కొంత భాగాన్ని మాత్రమే ఎలా షేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

మామూలుగా యూట్యూబ్‌ వీడియోలో మనకు వచ్చిన భాగాన్ని చూడమని స్నేహితులకు చెప్పేటప్పుడు మనం ఫలానా సమయం నుంచి చూడాలంటూ టైం మెన్షన్ చేస్తాం.లేదంటే చాప్టర్ వీక్షించమని సజెస్ట్ చేస్తాం.

 అయితే అన్ని వీడియోలకు చాప్టర్స్ ఉండవు.అందువల్ల ఈ ఫీచర్ అన్ని సందర్భాల్లోనూ ఉపయోగపడదు.

కానీ ఒక ట్రిక్ ద్వారా మీడియాలోని నచ్చిన భాగాన్ని మాత్రమే షేర్ చేయవచ్చు.మీరు డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌ బ్రౌజర్‌ ద్వారా నచ్చిన వీడియోలోని భాగాన్ని స్నేహితులకు షేర్ చేయవచ్చు.

దీన్నే టైమ్‌ స్టాంప్‌ ఆప్షన్‌ అని పిలుస్తారు.

Telugu Share, Start, Time Stamp, Youtube, Youtube Share-Latest News - Telugu

డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌ బ్రౌజర్‌ నుంచి వీడియోలోని నచ్చిన భాగాన్ని షేర్ చేసేందుకు మీరు మొదటగా మీకు నచ్చిన వీడియోని ప్లే చేయాలి.అలాగే నచ్చిన పార్ట్ వద్ద వీడియో పాజ్ చేసి షేర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఇప్పుడు మీకు ఒక పాప్-అప్ విండో ఓపెన్ కనిపిస్తుంది.

ఈ విండోలో వాట్సాప్, ఫేస్‌బుక్‌, ట్విట్టర్, ఈ-మెయిల్ వంటి షేర్ ఆప్షన్స్ కనిపిస్తాయి.అలాగే విండో కింద భాగంలో స్టార్ట్ ఎట్‌ (Start At) అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.

Telugu Share, Start, Time Stamp, Youtube, Youtube Share-Latest News - Telugu

ఆ ఆప్షన్ ముందు కనిపించే చెక్ బాక్స్ లో మీరు టిక్ మార్క్ నమోదు చేయాలి.అప్పుడు వీడియో యూఆర్‌ఎల్‌ చివరిలో t=100 లేదా మీకు నచ్చిన వీడియో స్టార్ట్ అయ్యే సమయం సెకండ్లలో పడుతుంది.ఉదాహరణకి మీరు వీడియోలోని 60 సెకన్ల నుంచి నచ్చిన పార్ట్ ఉందనుకోండి… అప్పుడు యూఆర్‌ఎల్‌ చివరిలో t=60 అని ఫీడ్ అవుతుంది.ఇప్పుడది షేర్ చేశాక ఫ్రెండ్స్ నేరుగా 60 సెకన్ల నుంచి వీడియో చూడగలుగుతారు.

Telugu Share, Start, Time Stamp, Youtube, Youtube Share-Latest News - Telugu

ఒకవేళ మీరు మొబైల్ ద్వారా మాన్యువల్‌గా యూట్యూబ్ వీడియో యూఆర్‌ఎల్‌ షేర్ చేయదలుచుకుంటే.లింకు చివరన &t=60 అని యాడ్ చేస్తే సరిపోతుంది.అయితే ఇక్కడ 60 అనేది మీకు నచ్చిన పార్టు నుంచి వీడియో స్టార్ట్ అయ్యే సమయం.ఉదాహరణకి ఒక వీడియోలో మీకు 120 సెకండ్ల నుంచి నచ్చినట్లయితే.

ఆ టైం నుంచి ఫ్రెండ్స్ చూసేలా మీరు వీడియో షేర్ చేయాలనుకుంటే ఉంటే.ఆ వీడియో లింక్ చివరన t=120 అని యాడ్ చేస్తే సరిపోతుంది.

ఫర్ ఎగ్జాంపుల్ మీరు https://youtu.be/M1ma92-cgp0 అనే వీడియో లింక్‌కు చివరన https://youtu.be/M1ma92-cgp0&t=120 ఇలా ఆడ్ చేయడం ద్వారా 120 సెకన్ల నుంచి వీడియో ప్లే అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube