రైలులో ఎప్పుడైనా బ్యాగ్ మరిచిపోతే ఎలా దక్కించుకోవాలి? రైల్వే ఎటువంటి సహాయం అందిస్తుందో తెలుసా?

ఒక్కోసారి మన తొందరపాటు వల్ల లేదా మరేదైనా కారణాలతో రైలులో లగేజీని మరచిపోతుంటాం.అటువంటి సందర్భంలో ఏం చేయాలి? ఇందుకు రైల్వేశాఖ ఎటువంటి సాయం చేస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.నిజానికి లగేజీని రైలులో మరిచిపోతే దానిని తిరిగి పొందవచ్చు.దీనికి సంబందించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.రైలులో బ్యాగ్ మిస్సయితే అదే స్టేషన్‌లోని రైల్వే అధికారులతో పాటు ఐపీఎఫ్ పోలీసులకు సమాచారం అందించాలి.దీని కోసం మీరు ఆర్‌పిఎఫ్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవచ్చు.

 How To Get Rid Of A Forgotten Bag On A Train Do You Know What Kind Of Help The R-TeluguStop.com

అటువంటి పరిస్థితిలో రైల్వే పోలీసులు ఆ లగేజీని కనుగొనేందుకు ప్రయత్నిస్తారు.

మీరు తెలియజేసిన సీటులో మీ సామాను ఉంటే దానిని అక్కడికి సమీపంలోని ఆర్ఆర్ఎఫ్ పోలీస్ స్టేషన్‌కు అందజేస్తారు.

ప్రయాణీకుడు తన లగేజీకి సంబంధించిన సరైన సమాచారాన్ని అందించడం దానిని తిరిగి పొందగలుగుతాడు.సాధారంగా ప్రయాణీకులెవరైనా వారి లగేజీని రైలులో వదిలిపెట్టినప్పుడు అది సంబంధిత స్టేషన్‌లో జమ అవుతుంది.

ప్రయాణీకులెవరైనా స్టేషన్‌లో లగేజీని వదిలివేస్తే స్టేషన్ మాస్టర్ దానిని సేకరిస్తారు.వాటిలో ఆభరణాలు లాంటివివుంటే అది రైల్వే స్టేషన్‌లో 24 గంటలు మాత్రమే ఉంచుతారు.

ఎవరైనా ఈ వస్తువును 24 గంటల్లో క్లెయిమ్ చేస్తే అది వారికి అందజేస్తారు.ఇలా జరగని పక్షంలో ఆ లగేజీని రైల్వే మండల కార్యాలయానికి తరలిస్తారు.

వీటిని మూడు నెలల వరకూ పర్యవేక్షిస్తారు.బంగారం లాంటి వస్తువులను కొన్ని అనుమతుల మేరకు విక్రయిస్తారు.

లగేజీ ఎవరిదనేది తేలకపోతే కొన్ని నిబంధల ప్రకారం ఆ వస్తువులు పారవేస్తారు.

Lost luggage in train Retrieve Lost Luggage in Train Mission Amanat

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube