మొటిమలను....ఇలా అదుపు చేయవచ్చు  

How To Remove Pimples Naturally-

ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో మొటిమల సమస్య ప్రధానమైనది.మొటిమల సమస్య రావటానికి హార్మోన్ల అసమానతలు,జిడ్డు అనేవి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.ఇప్పుడు వాటిపై ఒక లుక్ వేద్దాం.

How To Remove Pimples Naturally---

1.ప్రతి రోజు సాధ్యమైనంత తరచుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2.ఒక బౌల్ లో ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు,కొన్ని చుక్కల పాలు, అర స్పూన్ శనగపిండి వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మృదువుగా మసాజ్ చేసుకుంటే ముఖం మీద పేరుకుపోయిన మురికి తొలగి మొటిమల సమస్య తగ్గుతుంది.

3.మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపే గుణాలు దాల్చిన చెక్కతో ఉన్నాయి.ఒక బౌల్ లో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి,రెండు స్పూన్ల తేనె,ఒక స్పూన్ పాలు కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4.అరటి పండు తొక్కని మెత్తని పేస్ట్ గా చేసి దానిలో రెండు స్పూన్ల తేనె, అరస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాయాలి.ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది.