సాధారణంగా బల్లులు అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా భయపడిపోతుంటారు.కొందరికైతే బల్లి పేరు వింటేనే ఒళ్లు జలరించేస్తుంది.
వాటిని చూస్తేనే కాస్త చిరాగ్గా, భయంగా అనిపిస్తుంటుంది.ఇక విసుగు పుట్టించే బల్లులను ఇంట్లో నుంచీ వెళ్లగొట్టేందుకు ఏం చేయలో తెలియక తెగ సతమతమవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే గనుక చాలా సులభంగా బల్లులను బయటకు పంపొచ్చు.మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే వెల్లుల్లి అంటే బల్లులకు అస్సలు పడదు.అందుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలను లైట్‌గా క్రష్ చేసి కిటికీల వద్ద, తలుపుల వద్ద పెట్టాలి.
మరియు వెల్లల్లి రెబ్బల నుంచి రసం తీసి గోడలపై స్ప్రే చేయాలి.తద్వారా బల్లుల్లు ఇంట్లో పరార్ అవుతాయి.
వెల్లిల్లి బదులుగా ఉల్లి పాయలను కూడా అలా చేయొచ్చు.ఉల్లి వాసన సైతం బల్లులకు పడనే పడదు.

లెమన్ గ్రాస్ అంటే బల్లులు పారి పోతాయి.లెమన్ గ్రాస్ ని కాల్చిన పొగను ఇంట్లో మొత్తం వ్యాపించేలా చేస్తే బల్లులు ఎక్కడున్నా బయటకు వెళ్లిపోతాయి.అలాగే కర్పూరంతో కూడా బల్లులను బయటకు పంపవచ్చు.కర్పూరం బిల్లలను తీసుకుని మెత్తగా పొడి చేసి.బల్లులు ఎక్కువగా తీరిగే చోట ఆ పొడి వేయాలి.మరియు కిటికీలు, తలుపుల వద్ద కర్పూరం బిల్లిలను పెట్టాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక బిర్యానీ ఆకుల వాసన అంటే బల్లులకు అస్సలు నచ్చదు.
ఒకవేళ మీ ఇంట్లో బల్లుల బెదడ ఎక్కువగా ఉంటే నిప్పుల్లో బిర్యానీ ఆకులను మండించి.ఆ ద్వారా వచ్చే పొగను ఇంట్లో దూపం మాదిరిగా వేయాలి.
ఇలా చేయడం వల్ల బల్లులు పారి పోతాయి.