ఇలా చేస్తే రెండు నిమిషాల్లో మీ చెవిలో ఉన్న గులిమి సులభంగా బయటకు వచ్చేస్తుంది

సాధారణంగా మనలో చాలా మంది చెవిలో గులిమి తీయటానికి కాటన్ బడ్స్ వాడుతూ ఉంటాం.కానీ ఆలా వాడటం చాలా తప్పు.

 Ear Wax, Cotton Buds, Hot Water, Salt, Telugu Health, Health Tips-TeluguStop.com

చెవిలోకి దుమ్ము,ధూళి,నీరు వంటివి చేరటం వలన చెవిలో దురద ఏర్పడుతుంది.దురద వచ్చినప్పుడు చెవిలో కాటన్ బడ్ పెట్టి ఆ దుమ్మును తొలగించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఆలా చెవిలోకి కాటన్ బడ్ పెట్టుకోవటం అంత మంచి పని కాదు.

మన శరీరంలో అతి సున్నితమైన భాగాలలో చెవి ఒకటి.

అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.చెవిలోకి దుమ్ము వెళ్ళినప్పుడు లేదా చెవిలోకి నీరు వెళ్లి దురద వచ్చినప్పుడు కాటన్ బడ్ ఉపయోగిస్తూ ఉంటాం.

ఈ విధంగా ఉపయోగించినప్పుడు ఒక్కోసారి చెవిలో నరాలు దెబ్బతినే అవకాశం ఉంది.దీని కారణంగా వినికిడి శక్తి తగ్గిపోవటం లేదా గులిమి,నీరు వంటివి చెవి లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది.

అందువల్ల చెవిలో గులిమి తీయటానికి పిన్నీస్ లేదా కాటన్ బడ్ లను వాడటం క్షేమకరం కాదు.


సాధారణంగా ప్రతి ఒక్కరి చెవిలో గులిమి ఏర్పడటం సహజమే.

అది చెవిలో ఉండే నరాలకు రక్షణగా ఉంటుంది.అనేక రకాల ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

గులిమిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇవి చెవిని శుభ్రం చేస్తాయి.

ఈ విధంగా తయారైన గులిమి బయటకు దాని అంతట అదే వెళ్ళిపోతుంది.అయితే కొంతమంది ఈ విధంగా గులిమి ఏర్పడటం మంచి పద్దతి కాదని భావించి పిన్నీస్ లేదా ఇయర్ బడ్ లతోనే తీసేస్తూ ఉంటారు.

కానీ ఆలా చేయటం మంచి పద్దతి కాదని నిపుణులు అంటున్నారు.

కొంత మందిలో గులిమి సాధారణ స్థాయిలో కన్నా ఎక్కువగా తయారవుతుంది.

ఆలా ఎక్కువగా గులిమి ఉంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి.అందువల్ల గులిమిని బయటకు తీయటానికి సహజమైన పద్దతి ఉంది.ఈ పద్దతి చాలా సులువైనది.అది ఏమిటంటే….గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి.ఈ నీటిలో కాటన్ బాల్ ముంచి చెవిని వంచి ఆ నీటిని పిండాలి.ఐదు నిముషాలు అయ్యాక నీటిని పిండిన చెవిని వంచటం ద్వారా చెవిలోని గులిమి వదిలిపోతుంది.ఇలా రెండు చెవులను శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత ఉప్పు కలపని గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా చేయటం వలన చెవిలో ఉన్న గులిమి తొలగిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube