వారం రోజుల్లో కంటి కింద నల్లటి వలయాలు మాయం కావాలంటే ... బెస్ట్ చిట్కాలు  

How To Remove Dark Circles At Home-

కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడితే చాలా ఇబ్బందిగాను, అసహ్యంగా ఉండి నలుగురిలోకి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.చాలా మంది నల్లటి వలయాలు కనపడగానే చాలా ఆందోళనకు గురి అవుతూ ఉంటారు.

ఆలా పడవలసిన అవసరం లేదు.ఎందుకంటే మన ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.

How To Remove Dark Circles At Home- --

ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ఫాలో అయితే చాలు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

బాదం నూనెను కంటి చుట్టూ రాసి ఒక నిమిషం పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.15 నిమిషాల తర్వాత కాటన్ సాయంతో శుభ్రంగా తుడవాలి.

ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తూ ఉంటే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి.

కీరదోస రసం, నిమ్మరసం, టమాటా జ్యూస్ మూడింటిని సమానంగా తీసుకోని బాగా కలిపి కంటి చుట్టూ రాసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పుదీనా ఆకులను పేస్ట్ చేసి దానిలో నిమ్మరసం కలిపి కంటి చుట్టూ నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట తర్వాత శుభ్రంగా కడగాలి.

పసుపులో మజ్జిగ కలిపి పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని కంటి చుట్టూ రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

బ్లాక్, గ్రీన్ టీ బ్యాగులను అరగంట పాటు ఫ్రిజ్‌ లో ఉంచి ఆ బ్యాగ్ లను కంటి మీద పెట్టుకొని అరగంట రిలాక్స్ అయి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

తాజా వార్తలు