ఈ 6 టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లో పొట్ట అంతా మాయం... మీరు ఫాలో అవ్వండి  

How To Reduce Stomach Fat In 1 Week -

బిజీగా మారిన జీవనశైలి, నిద్రలేమి,ఒత్తిడి, సరైన వేళలో భోజనం చేయకపోవటం వంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు.బరువు పెరగటానికి మరియు పొట్ట పెరగటానికి ప్రధాన కారణం శరీరంలో కొవ్వు పెరగటమే.

ఆ కొవ్వును తగ్గించుకుంటే ఆటో మెటిక్ గా బరువు తగ్గిపోతాం.ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే బరువు తగ్గటానికి ఎక్కడికి వెళ్లనవసరం లేదు.

How To Reduce Stomach Fat In 1 Week-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అలాగే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టనవసరం లేదు.మన ఇంటిలో సులువుగా అందుబాటులో ఉండే కొన్ని పదార్ధాలతో పొట్ట ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

గుప్పెడు నల్ల ఉలవలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఉడకబెట్టి తింటే అధిక బరువు,పొట్ట తగ్గిపోతుంది.

బార్లీ పిండి, గోధుమ పిండి రెండూ కలిపి చేసిన రొట్టెలను తీసుకుంటే మంచి ఫలితం కనపడి త్వరగా పొట్ట తగ్గిపోవటమే కాకుండా బరువు కూడా తగ్గిపోతారు.


ఉత్తరేణి తైలం లేదా ఆవాల నూనెను గోరువెచ్చగా చేసి స్నానం చేయటానికి గంట ముందు కొవ్వు పెరిగిన భాగాలపై రాసి బాగా ఇంకేలా మ‌సాజ్ చేయాలి.ఆ తర్వాత స్నానం చేయాలి.ఈ విధంగా రోజూ చేస్తూ ఉంటే కొవ్వు త్వ‌ర‌గా కరిగిపోవటమే కాకుండా అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు.

కూరగాయలతో వండిన సూప్‌ను ఒక పూట ఆహారంగా తీసుకుంటే శరీరంలోకి అధిక కేలరీలు చేరవు.

తద్వారా అధిక బరువు తగ్గుతాం.

పాత బియ్యంతో కాచిన పలుచని జావను ప్రతి రెండు పూటలా రెండు గ్లాసులు తాగాలి.

దీనిని వండే సమయంలోలో జీలకర్ర పొడి,వాము పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి ఒక్కొక్కటి మూడు చిటికెలు చొప్పున వేయాలి.చిన్న అల్లం ముక్క, తగినంత సైంధవ లవణం, కొద్దిగా పుదీనా, కొత్తిమీర,కరివేపాకు వేసి తయారుచేయాలి.

ఇలా తయారుచేసిన జావను రెండు పూటలా త్రాగితే కొవ్వు త్వ‌ర‌గా క‌రిగిపోయి అధిక బ‌రువు త‌గ్గుతారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు