శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ ని బయటకు పంపే సూపర్ ఆహారాలు

How To Reduce Bad Cholesterol Naturally

మన జీవన విధానంలో కొన్ని మార్పులను చేసుకోవటం ద్వారా రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని చాలా సులభంగా బయటకు పంపవచ్చు.ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వలన రక్తంలో చెడు కొలస్ట్రాల్ తగ్గటమే కాకుండా బరువు కూడా తగ్గుతాం.

 How To Reduce Bad Cholesterol Naturally-TeluguStop.com

రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని బయటకు పంపే కొన్ని ఆహారాలు ఉన్నాయి.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆపిల్ రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.కాలేయంలో తయారయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను అదుపుచేస్తుంది.

 How To Reduce Bad Cholesterol Naturally-శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ ని బయటకు పంపే సూపర్ ఆహారాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆపిల్ లో ఉండే మాలిక్ ఆమ్లం శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది.

బీన్స్ లో ఉండే పీచు చెడు కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకుంటుంది.

బీన్స్ లో ఉండే లేసిథిన్ కొవ్వులను కరిగిస్తుంది.బ్లాక్‌బెర్రీలోని విటమిన్లు గుండె, రక్త ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలును చేస్తాయి.

ఇందులో ఉండే పెక్టిన్ కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటికి పంపుతుంది.ద్రాక్షలో ఉండే ఆంథోసైనిన్స్, టానిన్స్‌లు కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గిస్తాయి.

ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని విషాలను నిర్వీర్యం చేస్తుంది.పుట్టగొడుగుల్లో సమృద్ధిగా ఉండే విటమిన్ బి, సి, కాల్షియం, ఖనిజలవణాలు కొవ్వులను కరిగిస్తాయి.

జామలో ఉండే విటమిన్ సి, భాస్వరం, నికోటిన్ ఆమ్లం, పీచు పదార్థాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠంచేసి, కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను సంరక్షిస్తాయి.

అధిక రక్తపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెలుల్లి చాలా బాగా సహాయపడుతుంది.

బాదంలోని ఓలియిక్ యాసిడ్ వ్యాధుల నుంచి గుండెను రక్షిస్తుంది.జీడిపప్పు అసంతృప్త‌ కొవ్వులను తగ్గిస్తుంది.

వాల్‌నట్స్‌లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తాయి.ఓట్స్‌లోని బీటా గ్లూకస్ అనే ప్రత్యేక పీచుపదార్థం స్పంజిలా పనిచేసి కొలెస్ట్రాల్‌ను గ్రహిస్తుంది.

ప్రతి రోజు సోయాను తీసుకుంటే దీనిలో మాంసకృత్తులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాదు, కొలస్ట్రాల్ ని రక్తం నుంచి బయటకు పంపుతాయి.సోయాలో విటమిన్ బి3, బి6, ఇ ఉన్నాయి.

ఈ ఆహారాలను ప్రతి రోజు ఆహారంలో చేర్చుకొని గుండె జబ్బులకు కారణం అయినా చెడు కొలస్ట్రాల్ ని తగ్గించుకోండి.

how to reduce bad cholesterol naturally , Cholesterol, Anthocyanins, tannins and cholesterol, Oleic acid, Pectin Cholesterol, Beta glucose, Blackberry, Lecithin - Telugu Anthocyanins, Beta Glucose, Blackberry, Cholesterol, Reducebad, Lecithin, Oleic Acid

how to reduce bad cholesterol naturally , Cholesterol, Anthocyanins, tannins and cholesterol, Oleic acid, Pectin Cholesterol, Beta glucose, Blackberry, Lecithin - Telugu Anthocyanins, Beta Glucose, Blackberry, Cholesterol, Reducebad, Lecithin, Oleic Acid

#Blackberry #ReduceBad #Anthocyanins #Cholesterol #Oleic Acid

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube