కూతురుంటే చిన్నప్పటి నుంచి ఇలా పెంచాలి

కంటే కూతురనే కనాలిరా అన్నాడో సినీపెద్ద.మరి అంత వన్ సైడెడ్ అభిప్రాయం మనకెందుకు కాని, కూతురైనా, కొడుకైనా, ఓకేలా పెంచండి.

 How To Raise Your Daughter Independent And Strong-TeluguStop.com

ఒకనాటి రోజులు కావు ఇవి.కొడుకు ఏం చేయగలడో, కూతురు ఆ పనులన్నీ చేయగలదు.తను తన కాళ్ళపై నిలబడాలంటే, బయట అడుగుపెట్టిన, ఇంటిలోపల ఉన్నా, తాను పురుషుడికి ఏమాత్రం తక్కువ కాదని అనుకోవాలంటే, ఆ ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని చిన్ననాటి నుంచే నూరిపోయాలి.అంటే చిన్నప్పటి నుంచే ఆమెని సరైన పద్ధతిలో పెంచాలి.

* ఓ ఆరేడేళ్ళ వయసు రాగానే మార్కేట్ కి వెళుతున్నప్పుడు తనతో పాటే కొడుకుని తీసుకెళతాడు తండ్రి.అంటే, ఆ పసివాడికి ఈ ప్రపంచాన్ని పరిచయం చేయాలని.

రేపు, నువ్వు కూడా నాలానే ఇంటిపనులు ఇలా చేయాలని ఓరకంగా హింట్ ఇస్తాడు తండ్రి.కేవలం కొడుకునే ఎందుకు? కూతురిని ఎందుకు తీసుకెళ్ళకూడదు? తన కేవలం తెచ్చిన కూరగాయల్ని కోయడానికే లేదుగా.చిన్ననాటి నుండే మీ అమ్మాయికి బయటి ప్రపంచాన్ని పరిచయం చేయండి.

* ప్రతి చిన్న విషయానికి “వాడు అబ్బాయి, వాడు చేస్తాడు, వాడు అబ్బాయి .వాడికి నీకు తేడా లేదు” అనే డైలాగ్ వద్దు.ఇక్కడినుంచే, అమ్మాయిలు తమని తాము అబ్బాయిలకన్నా తక్కువగా చూసుకోవడం మొదలుపెట్టేది.

ఎవరు చేసిన అల్లరి అల్లరే.ఎవరి చేసినా తప్పు తప్పే.

అందులో అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేదు.ఇదే నేర్పండి.

* ప్రతి విషయానికి తాను తండ్రి మీదో, తమ్ముడు లేదా అన్న మీదో ఆధారపడకూడదు.చిన్ననాటి నుంచి మొదలయ్యే ఈ చిన్న అలవాటే పెద్దయ్యాక ఆమె ఎదుగుదలకి అడ్డుగా మారవచ్చు.కాబట్టి ఆమెని సహాయపడతూనే, తన మీదే తను ఆధారపడేలా ప్రొత్సహించండి.

* బయటకెళ్ళి ఆటలు ఆడటాన్ని, స్కూలు ఫంక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడాన్ని, ముఖ్యంగా అబ్బాయిలతో పోటిపడటాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి.

అప్పుడే పోటితత్త్వంలో తనలో ఇమిడిపోతుంది.అలాగే తనకి నలుగురిలో ధైర్యంగా ఉండటం, నలుగురితో కలిసి ఉండటం అలవాటు అవుతుంది.

* తన శరీరం గురించి తనకి అవగాహన ఉండాలి.ఈ విషయంలో తనని పట్టించుకోవాల్సింది తల్లే.పీరియడ్స్ గురించి, తన శరీరంలో జరిగే మార్పుల గురించి, ఆ సమస్యలు, వాటి పరిష్కారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు .అన్ని ఓ వయసుకి రాగానే తల్లి విడమరిచి చెప్పాలి.

* ఇక చివరగా, తను జీవితంలో చేయాల్సింది పెళ్ళి చేసుకోని, పిల్లల్ని కనడం మాత్రమే కాదు, పెళ్ళికి ముందు, పెళ్ళి తరువాత కూడా చాలా సాధించాలని, ఒకరి మీద ఆధారపడి ఉండకూడదని, అందుకోసం తను ఎలాంటి లక్ష్యాన్ని ఎంచుకున్న, ఆడపిల్ల అనే వివక్ష ఉండదని నమ్మకం కలిగించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube