వర్షాకాలంలో చర్మాన్ని కాపాడుకునేది ఎలా?  

How To Protect Your Skin In This Rainy Season-

English Summary:Watching come the rainy season. Rain greets vasulanaite rojukosaraina Hyderabad.This time the skin is broken, put to the torch, duradapettadam, scaling tend to occur. Vadestuntaru various insects to protect skin from the cold weather.

But it is to be reimbursed, in full satisfaction is hard to come by. How kapadukunedi the skin during the rainy season?

Reducing the work to be done before sabbuvadakanni.Instead of pointing out the good results on the body of sabbuki sanagapindito. The use of soap suddenly found it difficult to fully vadeyatam, two, three days to toe bath.

The podicarmam unnavarikaite, it's a hell of a rainy season. This season should be eating fruit in such a variety available.Egg foams use the skin as a result. As well as papaya, apple, fruit pulp to the face to hold on, hold for twenty minutes, and then washing the face.

Sandalwood, rose water, yellow face cikkinappudalla to be falling. Yogurt, turmeric, honey to the mixture podicarmam causes them great comfort.Rupture of the soap is good for the skin vadakapovadame. Sunnipindi, gram can work at times like these.

..

చూస్తుండగానే వర్షాకాలం రానేవచ్చింది. హైదరాబాద్ వాసులనైతే రోజుకోసారైనా పలకరిస్తోంది వర్షం. ఇలాంటి సమయంలో చర్మం పగిలిపోవడం, మంట పెట్టడం, దురదపెట్టడం, ఊడిపోవడం జరుగుతూ ఉంటాయి..

వర్షాకాలంలో చర్మాన్ని కాపాడుకునేది ఎలా?-

చల్లని వాతావరణం నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు రకరకాల క్రిములు వాడేస్తుంటారు.డబ్బులు పెట్టడమే కాని, పూర్తిస్థాయిలో సంతృప్తి దొరకడం మాత్రం కష్టం. మరి వర్షాకాలంలో చర్మాన్ని కాపాడుకునేది ఎలా?ముందుగా చేయాల్సిన పని సబ్బువాడకాన్ని తగ్గించడం.

సబ్బుకి బదులుగా శనగపిండితో శరీరాన్ని రుద్దితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒక్కసారిగా సబ్బు వాడకాన్ని పూర్తిగా వాడేయటం కష్టం అనిపిస్తే, రెండు,మూడు రోజులకోసారి సబ్బుతో స్నానం చేయండి.ఇక పొడిచర్మం ఉన్నవారికైతే, వర్షాకాలం నరకంగా అనిపిస్తుంది.

ఇలాంటివారు ఈ సీజన్ లో దొరికే రకరకాల పండ్లను తింటూ ఉండాలి. గుడ్డు సొనను చర్మంపై ఉపయోగించినా ఫలితం ఉంటుంది. అలాగే బొప్పాయి, ఆపిల్ పండ్ల గుజ్జుని ముఖానికి పట్టి, ఇరవై నిమిషాలు ఉంచి, ఆ తరువాత ముఖం కడుక్కోవాలి.

గంధం, రోజ్ వాటర్, పసుపుని వీలు చిక్కినప్పుడల్లా ముఖానికి పడుతూ ఉండాలి. పెరుగు, పసుపు, తేనేలతో చేసిన మిశ్రమం కూడా పొడిచర్మం వారికి గొప్ప ఊరటను కలిగిస్తుంది.చర్మం పగిలితే మాత్రం సబ్బు వాడకపోవడమే మంచిది.

సున్నిపిండి, శనగపిండి ఇలాంటి సమయాల్లో పనికొస్తాయి.