ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది.ఈ సీజన్‌లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాల విజృంభణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ క్రమంలోనే ఓవైపు కరోనా వైరస్‌తో ముప్ప తిప్పలు పడుతున్న ప్రజలు.మరోవైపు విష జ్వరాలకూ తీవ్రంగా వణికిపోతున్నారు.
అడపా దడపా కురుస్తున్న వర్షాల కారణంగా విష జ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.అయితే ఇలాంటి తరుణంలో విష జ్వరాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి ఆ ఆహారాలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు, అల్లం, వెల్లుల్లి, సోంపు, జీలకర్ర, వాము వంటివి అధికంగా తీసుకోవాలి.
ఎందుకంటే, వీటిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచే విష జ్వరాలను దరి దాపుల్లోకి రాకుండా అడ్డు కట్ట వేస్తాయి.
అలాగే విటమిన్ సి ఫుడ్‌ను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.
విష జ్వరాల నుంచి కాపాడటంతో విటమిన్ సి ఎంతగానో సహాయపడుతుంది.అందుకే ఉసిరికాయ, నిమ్మ, కివి పండు, టమోటా, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, జామకాయ, బొప్పాయి వంటి ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.

ఈ సీజన్‌లో దానిమ్మ రసం పిల్లలు, పెద్దలు అనే లేకుండా అందరూ తీసుకోవాలి.దానిమ్మలో ఉండే పోషక విలువలు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.విష జ్వరాలు రాకుండా ఉంటాయి.రక్త హీనత పరార్ అవుతుంది.చర్మ అలర్జీలు మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
వర్షాకాలంలో ప్రతి రోజు ఒక కప్పు తులసి ఆకులతో తయారు చేసిన టీని తీసుకోవాలి.తులసి ఆకుల టీ ఎన్నో జబ్బులను నివారిస్తుంది.ముఖ్యంగా విష జ్వరాల నుంచి మిమ్మల్ని రక్షించడంలో ప్రభావంతంగా పని చేస్తుంది.
ఇక వీటితో పాటుగా ఇంట్లోకి దోమలు, ఈగలు రాకుండా చూసుకోవాలి.
ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.దోమలను కుట్టకుండా శరీరానికి క్రీములు అప్లై చేసుకోవాలి.
వాటర్ ఎక్కువగా సేవించాలి.బయట ఆహారాలకు దూరంగా ఉండాలి.
మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను నివారించుకోవాలి.తద్వారా విష జ్వరాల బారిన పడకుండా ఉంటారు.