ఆరోగ్యం కోసం రోజుకి ఎన్నిపూటలు తినాలి? ఏ టైంలో తినాలి?  

How To Plan 8 Meals In A Day? Perfect Diet Plan-

English Summary:How many meals a day are provided to the body putalu you? If you ask this question is that muduputalu thakkuna. 8 times a day in our body to provide non-food.Someone says it is not the word, the word daitisiyans saying. Meals in the morning to 8 at night to badiki.But Dandy consume 8 times. Anaru that tinadanne not just food, the food is liquids.In this way, 8 times a day to eat / drink ..Let's see what is going to take.

1) drinking water koddinimisallo risen in the morning, as the body hydrated to dihaidret.Did not have any liquids in your body is the last edenimidi hours. So it is necessary.I woke up early in the morning to six o'clock, 6:15 minutes, when the time is right for this to work.

2) Personnel programs purticesukoni, 6: 45-7.Coffee between 00 minutes, take the green is like. Tea / coffee habit lekapotene better.Green IT, lemon juice ..

మీరు రోజుకి ఎన్ని పూటలు శరీరానికి ఆహారాన్ని అందిస్తారు? ఈ ప్రశ్న అడిగితే ఠక్కున మూడుపూటలు అని అంటారు. కాని మన శరీరానికి ఓ రోజులో 8 సార్లు ఆహారాన్ని అందించాలట. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, డైటిషియన్స్ చెబుతున్న మాట. ఉదయం నుంచి రాత్రి వరకు 8 మీల్స్ బాడికి అవసరం. అలాగని 8 సార్లు దండిగా తినేరు. కేవలం తినడాన్నే ఆహారం అని అనరు కాదు, ద్రవపదార్థము కూడా అహారమే..

ఆరోగ్యం కోసం రోజుకి ఎన్నిపూటలు తినాలి? ఏ టైంలో తినాలి? -

ఈరకంగా 8 సార్లు ఎలా తినాలో/తాగాలో . ఏం ఏం తీసుకోవాలో చూద్దాం.1) పొద్దున్నే లేచిన కొద్దినిమిషాల్లో మంచినీళ్ళు తాగి, డీహైడ్రేట్ గా ఉన్న శరీరాన్ని హైడ్రేటెడ్ చేసుకోండి. గత ఏడెనిమిది గంటల్లో మీ శరీరంలోకి ఎలాంటి ద్రవపదార్థము వెళ్ళలేదు కదా.

కాబట్టి ఇది అవసరం. ఉదయాన్నే ఆరు గంటలకి నిద్రలేస్తే, 6:15 నిమిషాల సమయంలో ఈ పని చేస్తే సరి.2) పర్సనల్ కార్యక్రమాలు పూర్తిచేసుకోని, 6:45-7.00 నిమిషాల మధ్య కాఫీ, గ్రీన్ లాంటిది తీసుకోండి. టీ/కాఫీ అలవాటు లేకపోతేనే బెటర్. గ్రీన్ టి, నిమ్మరసం .

డిటాక్సిఫీకేషన్ కి పనికొచ్చే ఏదైనా పండ్ల రసం తీసుకోండి.3) 7:30 సమయంలో ఆరోగ్యకరమైన టిఫిన్ తీసుకోండి. నూనె లేని ఇడ్లి అయిన, న్యూట్రీషన్ గల వెజ్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ లాంటిది.

4) 10:30 – 11:00 మధ్య నట్స్, బీన్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. కుదిరితే ఓ పది నిమిషాలు ఎండలో నిలబడి విటమిన్ డి పొందాలి. ఉడకబెట్టిన గుడ్డు కూడా తినొచ్చు ఈ సమయంలో. 5) 1:00 – 2:00 మధ్యలో లంచ్ చేయండి. రైస్ తీసుకోండి కాని లిమిట్ లో.

పెరుగుతో కూడా కలిపి తినండి. కూరల్లో పప్పు ఉండేలా చూసుకోండి.6) 4:00 – 5:00 మధ్య గ్రీన్ టీ తాగితే మేలని డాక్టర్లు చెబుతున్నారు. స్నాక్స్ సమయం కదా అని మసాలా ఉండే ఆహారాన్ని తినేయొద్దు.

7) 6:00 – 7:00 మధ్య చపాతి కాని, గోధుమలతో చేసిన ఆరోగ్యకరమైన పదార్థాలని కాని తీసుకోవచ్చు. ఏం తిన్నా, లైట్ గా తినండి. రాత్రి నిద్రకి ఆటంకం కలిగించని ఆహారాన్ని తీసుకోండి.8) 8:00 – 9:00 మధ్య పాలు లేదా పెరుగు తాగండి. శరీరంలో టెంపరేచర్ తక్కువ అవుతుంది.

హాయిగా నిద్రపడుతుంది.ఇదండీ 8 సమయాల్లో మన శరీరానికి ఆహారాన్ని అందించే విధానం. ఈ డైట్ లో మీకు కావాల్సినన్ని కాలరీలతో పాటు, న్యూట్రింట్స్ కుడా దొరుకుతున్నాయి. పదార్థాలు మార్చినా, ఈ టైమింగ్స్ ఇతర ఆహారపదార్థాలతో (ఆరోగ్యకరమైనవే) పాటించేందుకు ప్రయత్నించండి.