జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా,తేమగా ఉంచే పదార్ధాలు       2018-05-04   00:47:23  IST  Lakshmi P

జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా,తేమగా ఉంటేనే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అయితే మనలో చాలా మంది దీని పట్ల పెద్దగా శ్రద్ద పెట్టరు. జుట్టు కుదుళ్ళు తేమగా ఉంటే దురద, చుండ్రు,పొడి జుట్టు వంటి సమస్యలు రావు. బ్యూటీ స్టోర్స్ లో దొరికే ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్ధాలతో సులభంగా జుట్టు కుదుళ్ళు తేమగా ఉండేలా చేసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

ఆలివ్ నూనె జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ చేసి ఎక్కువసేపు తేమగా ఉండేలా చేస్తుంది. ఆలివ్ నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసి మసాజ్ చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

కలబంద జెల్ జుట్టు కుదుళ్లను తేమగా ఉంచటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కలబంద మొక్క నుండి ఒక స్పూన్ జెల్ ని తీసుకోని తలకు బాగా పట్టించాలి. అరగంట అయ్యాక తలస్నానము చేయాలి. ఇది తలపై అద్భుతాలను చేస్తుంది.

అరటిపండు జుట్టు కుదుళ్లకు తేమను అందించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అరటిపండును మెత్తని పేస్ట్ గా చేసి తలకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు పొడిగా కాకూండా తేమగా ఉంటుంది.

ఉల్లిరసంలో ఉండే యాంటీసెప్టిక్ ఏజెంట్లు మీ జుట్టు కుదుళ్ళ వద్ద ఇన్ఫెక్షన్లు రాకుండా మరియు తేమగా ఉండేలా చేస్తాయి. మీరు మీ తలను తాజా ఉల్లిరసంతో తలంటుకోవచ్చు లేదా ఇతర సహజ పదార్థాలతో కలిపి ప్రయత్నించవచ్చు. దీనిద్వారా మీ జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.