మస్కారాను ఇంటిలో ఎలా తయారుచేసుకోవాలి  

How To Make Your Own Mascara -

మస్కారాను ఇంటిలో ఎలా తయారు చేయాలా అని ఆలోచనలో పడ్డారా? దీనిని ఖచ్చితంగా ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు.ఇకపై సౌందర్య స్టోర్ వద్ద చాలా ఖరీదైన మస్కారాను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు.

చాలా సులువుగా ఇంటిలో తయారుచేసుకోవచ్చు

How To Make Your Own Mascara-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఇంటిలో తయారుచేసుకొనే సేంద్రీయ మస్కారా వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.అలాగే కళ్ళకు మరింత అందాన్ని మరియు ఆకర్షణను జోడిస్తుంది.

కళ్ళకు మస్కారా రాసినప్పుడు ఒక అందమైన ఆకృతిని సృష్టిస్తుంది

కావలసినవి


బ్లాక్ మినరల్ పౌడర్
బెంటోనైట్ బంకమట్టి – ఇది మస్కారా గట్టిపడకుండా నిరోదించటానికి మరియు
ముదురు రంగు రావటానికి
కలబంద – సున్నితత్వం మరియు ఒక అందమైన నిర్మాణం సృష్టించడానికి
లావెండర్ నూనె – మంచి సువాసన ఇవ్వటానికి మరియు కనురెప్పల పెరుగుదలకు
ఒక సాధారణ మాస్కరా కంటైనర్
ఒక చిన్న గరిటె
సాధారణ ఔషధ డ్రాపర్

పద్దతి


* ఒక గిన్నెలో బ్లాక్ మినరల్ పౌడర్,బెంటోనైట్ బంకమట్టి, లావెండర్ నూనె వేసి మిశ్రమం మృదువుగా అయ్యే వరకు బాగా కలపాలి
* దానికి స్థిరత్వం సృస్టించటానికి కలబంద జెల్ ని వేసి బాగా కలపాలి
* ఆ తర్వాత ఒక గరిటె సాయంతో ఔషధ డ్రాపర్ తో మస్కారాను నిదానంగా మాస్కరా కంటైనర్ లోకి వేయాలి
* అలాగే మరొక పద్ధతిని కూడా ప్రయత్నించవచ్చు.ఒక ట్యూబ్ లో అన్ని పదార్దాలను వేసి బ్రష్ సాయంతో కలపాలి.

దీనికి కొంత సమయం పడుతుంది.కాబట్టి ఓపికగా వెయిట్ చేయాలి
* ఈ విధంగా తయారుచేసుకున్న మస్కారాను ఒక సాధారణ మస్కారాను ఎలా ఉపయోగిస్తామో అలాగే ఉపయోగించాలి
* మస్కారాను తొలగించటానికి వెచ్చని నీరు లేదా ఆలివ్ నూనె లో ముంచిన కాటన్ వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది.

ఇది సహజమైన కంటి మేకప్ రిమూవర్ గా పనిచేస్తుంది

క్లే మస్కారా


ఇంట్లో తయారుచేసుకోనే ఈ క్లే మాస్కరాను పైన చెప్పిన మాస్కరా కంటే చాలా తేలికగా సిద్ధం చేసుకోవచ్చు.ఇది కళ్ళను మరింత అందంగా మరియు ఆకర్షణీయంగా చేస్తుంది

కావలసినవి


నల్ల బంకమట్టి – 4 1/2 స్పూన్స్
ఎరుపు రీఫ్ మట్టి – అరస్పూన్
గుఅర్ గమ్ – చిటికెడు
గ్లిజరిన్ – పావు స్పూన్
నీరు – ఒక స్పూన్

పద్దతి


* ఒక గిన్నెలో నల్ల బంకమట్టి, ఎరుపు రీఫ్ మట్టి,గుఅర్ గమ్ వేసి బాగా కలపాలి
* ఆ తర్వాత గ్లిజరిన్ కలపాలి
* వాటిని బాగా కలపాలి.

అవసరం అయితే కొంచెం నీటిని కలపవచ్చు
* ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మాస్కరా ట్యూబ్ లో నిల్వ చేయాలి
* చాలా మంది 5 గ్రాముల జార్స్ ఉపయోగిస్తూ ఉంటారు.అయితే చిన్న పాత కంటైనర్లు ఇంటిలో ఉంటే మాత్రం సంకోచించకుండా ఉపయోగించవచ్చు
* అదనంగా ఉన్న దానిని తొలగించండి
* మస్కారా ను రాసినప్పుడు, వివిధ రకాల బ్రష్ లను ఉపయోగించి ఉత్తమమైన దానిని ఎంచుకోండి.

తాజా వార్తలు

How To Make Your Own Mascara- Related....