జుట్టు ఒత్తుగా వేగంగా పెరగాలంటే....బెస్ట్ చిట్కా  

  • ప్రతి ఒక్కరు జుట్టు ఒత్తుగా,పొడవుగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అవి తాత్కాలికంగా పనిచేసిన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో ట్రై చేస్తే డబ్బు ఆదా అవ్వటమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా,వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు ఆ చిట్కాకు ఏమి అవసరం అవుతాయో తెలుసుకుందాం. ఈ చిట్కాకు కేవలం రెండు ఇంగ్రిడియాన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.

  • కావలసిన పదార్ధాలు
    జాన్సన్ బేబీ ఆయిల్
    విటమిన్ E క్యాప్సిల్

  • ఒక బౌల్ లో ఒక స్పూన్ జాన్సన్ బేబీ ఆయిల్ తీసుకోని దానిలో ఒక విటమిన్ E క్యాప్సిల్ లోని ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా పెరగటాన్ని గమనించి మీరు ఆశ్చర్యపోతారు.

  • విటమిన్ E క్యాప్సిల్ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటుంది. విటమిన్ E క్యాప్సిల్ లో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల తల మీద చర్మానికి పోషణను అందించి జుట్టు ఒత్తుగా,వేగంగా పెరగటానికి సహాయపడుతుంది. జాన్సన్ బేబీ ఆయిల్ జుట్టుకు పోషణ ఇవ్వటమే కాకుండా జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.