ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్న తులసి టీని ఎలా తయారుచేయాలో తెలుసా?

తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.తులసిని మన పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్నారు.

 How To Make Tulsi Tea Andbenefits-TeluguStop.com

తులసి ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.ప్రతి రోజు ఉదయం ఒక కప్పు తులసి టీ త్రాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే తులసితో టీ ఎలా తయారుచేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు తులసి టీ ఎలా తయారుచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు

తులసి ఆకులు కొన్ని
అల్లం చిన్న ముక్క
వాము పావు టీ స్పూన్
జీలకర్ర పావు టీ స్పూన్
మిరియాలు పావు టీ స్పూన్
బెల్లం తగినంత

తయారి విధానం
ఒక గిన్నెలో నీటిని పోసి పైన చెప్పిన పదార్ధాలన్నీ వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.బాగా మరిగిన తర్వాత వడకట్టి వేడిగా ఉన్నప్పుడే త్రాగాలి.ప్రతి రోజు త్రాగటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది.జ‌లుబు, జ్వ‌రం, ద‌గ్గు వంటి వాటికీ మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

రక్తంలో చక్కర స్థాయిలను స్థిరీకరణ చేస్తుంది.దాంతో మధుమేహాం అదుపులో ఉంటుంది.

తులసి టీలో ఉండే పొటాషియం మెదడులో సెరోటినిన్ లెవల్స్ ను పెంచటం వలన డిప్రెషన్,.ఒత్తిడి, ఆందోళ‌న దూర‌మ‌వుతాయి.

యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.అంతేకాక ర‌క్త స‌ర‌ఫరా మెరుగు పడుతుంది.

బీపీ కంట్రోల్ అవుతుంది.గుండె స‌మ‌స్య‌లు రావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube