ఇడ్లీలు తెల్లగా,మృదువుగా,హోటల్లో వచ్చినట్టు రావాలంటే ఈ చిట్కాలు పాటించాలి  

How To Make Spongy Idly Tips-

ఇడ్లి దక్షిణ భారతీయుల అభిమాన అల్పాహారం. ఊదయపు సమయాలాలలో దీనిని అల్పాహారంగా తీసుకుంటారు సాధారణంగా మినప పప్పు, ఉప్పుడు లేక బియ్యం నాన బెట్టి రుబ్బి లేక రవ్వ కలిపి ఆరు నుండి పన్నెందు గంటల సమయం పులియ పెట్టి ఆ పిండిని ప్రత్యేకమైన ఇడ్లి పాత్రలో ఆవిరి మీద ఉడికిస్తారు. వీటిని సాంబారు, చెట్నీ మరియు వివిధ రకాల పోడులతో నూనెను కలిపి తింటారు. . మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణం చేసుకుంటుంది. అందుకే ఇడ్లిని చిన్న పిలల్లకు, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.ఇలాంటి ఇడ్లి మృదువుగా,మెత్తగా హోటల్లో వచ్చినట్టు రావాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.

గుండు మినపప్పు 4 గంటలు ఇడ్లి రవ్వ 2 గంటలు నానబెట్టి రుబ్బాలి. రుబ్బిన పిండిని నాలుగు నుంచి ఐదు గంటల పాటు పులియబెట్టాలి.


మిన పప్పును నానబెట్టే సమయంలో కొంచెం మెంతులు వేస్తె ఇడ్లిలు మెత్తగా వస్తాయి. అదే మెంతులు ఎక్కువైతే ఇడ్లి చేదుగా ఉంటుంది.

ఇడ్లి పిండి రుబ్బేసమయంలో నానబెట్టిన అటుకులను వేస్తె ఇడ్లి మృదువుగా తెల్లగా వస్తుంది

ఇడ్లి ఉడికాక పొయ్యి మీద నుంచి దించాక ఐదు నిమిషాల తర్వాత మాత్రమే ప్లేట్ లో నుంచి తీయాలి.

ఇడ్లి ప్లేట్ లో తక్కువ పిండి వేసి ఉడికించితే ఇడ్లి తీసేటప్పుడు బాగా వస్తుంది.

ఈ చిట్కాలను పాటిస్తే ఇడ్లీలు తెల్లగా,మృదువుగా,హోటల్లో వచ్చినట్టు వస్తాయి.