చపాతీ మెత్తగా మృదువుగా రావాలంటే ఈ చిట్కా పాటిస్తే చాలు  

How To Make Soft Chapati At Home In Telugu-

చపాతీలు మృదువుగా,మెత్తగా ఉంటే తినటానికి చాలా బాగుంటాయి. కానీ చాలమందికి చపాతీలు గట్టిగా వస్తు ఉంటాయి. తినటానికి చాలా ఇబ్బందిగా ఉంటుందిగోధుమపిండితో కొంచెం సన్నగా పలుచగా చేస్తే పుల్కా అని,కొద్దిగలావుగా,మందంగా చేస్తే చపాతీ అని,పొరలు పొరలుగా చేసి కూర స్టఫింగ్ చేస్తపరోటా అని అంటాం..

చపాతీ మెత్తగా మృదువుగా రావాలంటే ఈ చిట్కా పాటిస్తే చాలు-

చాలా మంది చపాతీలు మృదువుగా రావటం లేదని చేయటం మానేస్తఉంటారు. కానీ చపాతీలు మెత్తగా మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాలనపాటించాలి. ఈ చిట్కాలు కూడా చాలా సులువుగానే ఉంటాయి.

వాటి గురించతెలుసుకుందాం.

చపాతీ మెత్తగా,అంచులు అన్ని సమానంగా వచ్చి బాగా కాలాలంటే పిండి కలిపసమయంలో కొంచెం వేడిపాలను పోసి బాగా కలపాలి. చపాతీ పిండిలో 60 శాతనీటిని,40 శాతం పాలను పోసి కలిపితే చపాతీలు చల్లారిన తర్వాత కూడమెత్తగా,మృదువుగా ఉంటాయి..

పిండి కలిపాక గంట వరకు చపాతీ చేయకూడదు. గంట లోపు చపాతీ చేస్తే గట్టిగావస్తాయి.

చపాతీలు మెత్తగా రుచిగా రావాలంటే బాగా పండిన అరటిపండు ముక్కను వేసి బాగకలిపి అరగంట తర్వాత చపాతీ చేసుకోవాలి.

చపాతీలు కాల్చే సమయంలో మంట మధ్యస్థంగా ఉండాలి. ఎక్కువ మంట పెట్టకాల్చితే గట్టిగా వస్తాయి.

చపాతీలు కాల్చిన తరువాత హాట్ ప్యాక్ లో వెంటనే పెట్టకూడదు ఆలా పెడితఆవిరి వచ్చి చపాతీలు తడిగా అవుతాయి. అందుకే ఒక 10 నిమిషాల తరువాత హాటప్యాక్ లో పెట్టాలి.

ఈ సారి చపాతీలు చేసేటప్పుడు ఈ చిట్కాలన్నీ పాటిస్తే ఎన్ని తిన్నా ఇంకతినాలనే అనిపిస్తుంది.