బియ్యంపిండి తో అద్భుతమైన ఫెస్ ప్యాక్

మహిళల అందంలో బియ్యంపిండి కీలకమైన పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చు.బియ్యంపిండి ముఖానికి పాలిష్ ఇచ్చి కాంతివంతంగా చేస్తుంది.

 How To Make Rice Powder Face Pack-TeluguStop.com

బియ్యంపిండి అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.ఈ బియ్యంపిండి పేస్ ప్యాక్ అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది.

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.చర్మం మీద అద్భుతాన్ని చేస్తుంది.

ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే చర్మం మృదువుగా,కాంతివంతంగా మారుతుంది.ఇప్పుడు ఆ పేస్ ప్యాక్ కి కావలసిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు

బియ్యంపిండి ఒక స్పూన్
తేనే ఒక స్పూన్
పాలు సరిపడా జిన్సెంగ్ చూర్ణం అరస్పూన్

తయారి విధానం

ఒక బౌల్ లో బియ్యంపిండి,తేనే,జిన్సెంగ్ చూర్ణం వేసి పేస్ట్ అవ్వటానికి సరిపడా పాలను కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ ముఖం మీద దుమ్ము,ధూళి లేకుండా కాంతివంతంగా చేస్తుంది.పాలలో లక్షణాలు ముఖానికి తేమను అందిస్తాయి.జిన్సెంగ్ చూర్ణంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండుట వలన వృద్దాప్య ఛాయలు కనపడకుండా చేస్తుంది.

అలాగే ముడతలను తగ్గించటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ముఖ్యంగా ఈ ప్యాక్ ఆయిలీ స్కిన్ వారికి అద్భుతంగ పనిచేస్తుంది.ఈ ఫేస్ ప్యాక్ ని వారానికి ఒకసారి వాడడం ద్వారా అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ ప్యాక్ ని మీరు కూడా ట్రై చేసి అద్భుతమైన ఫలితాలను పొందండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube