టమాటో.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దాదాపు అందరి ఇళ్లల్లోనూ టమాటో కామన్‌గా ఉండే కూరగాయ.రోజూవారీ వంటల్లో దీనిని విరి విరిగా ఉపయోగిస్తుంటారు.టమాటోను డైరెక్ట్‌గా వండినా.లేదా వేరే ఏదైనా కూరల్లో వేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.
పోషకాలు కూడా ఇందులో మెండుగానే ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి టమాటో బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
చర్మ సౌందర్యానికీ దీనిని ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే.అయితే ముఖ్యంగా టమాటోతో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేస్ క్రీమ్‌ను తయారు చేసుకుని వాడితే గనుక.
అనేక చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.
మరి లేటెందుకు టమాటోతో ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
మొదట బాగా పండిన ఒక టమాటో తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్‌లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు, నాలుగైదు స్పూన్ల రోజ్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి.
జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.
ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల టమాటో జ్యూస్, నాలుగు స్పూన్లు ప్యూర్ అలోవెర జెల్, అర స్పూన్ ఆల్మండ్ ఆయిల్, నాలుగు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బీటర్ సాయంతో పది నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే టమాటో క్రీమ్ సిద్ధమైనట్టే.దీనిని ఒక బాక్స్‌లో నింపు కుని ఫిడ్జ్‌లో పెట్టుకుంటే పది రోజుల వరకు వాడుకోవచ్చు.
ఈ టమాటో క్రీమ్‌ను వాడటం వల్ల స్కిన్ టోన్ పెరుగుతుంది.
చర్మంపై ఏర్పడిన నల్ల మచ్చలు పరార్ అవుతాయి.ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, గ్లోగా మెరిసి పోతుంటుంది.
మరియు చర్మం తరచూ డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది.కాబట్టి, పైన చెప్పిన విధంగా టమాటో ఫేస్ క్రీమ్‌ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.