క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చా.. ??

అదేంటండి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చా అని అడుగుతున్నారు.అదేమన్న మిక్సిలో వేసి పట్టే మసాల పొడి అనుకుంటున్నారా? లేక నూనెలో గోలించే అప్పడాలని అనుకుంటున్నారా? వ్యాక్సిన్ అండీ.వ్యాక్సిన్ అంటే అలాంటి ఇలాంటి వ్యాక్సిన్ కాదు కొన్ని లక్షల ప్రాణాలు తీసుకున్న కరోనా వ్యాక్సిన్.కొన్ని నెలల పాటు ప్రపంచం మొత్తం గడగడలాడించిన వైరస్‌ను చంపే వ్యాక్సిన్.

 Corona Virus, Vaccine, How To Make, Home, Google-TeluguStop.com

మరి అందేంటి హెడ్‌లైన్ అలా ఉందని కదా మీ అనుమానం.అక్కడికే వస్తున్నా.

ప్రజలకు ఏదైనా ఉచితంగా పొందాలనే ఆరాటం ఎక్కువ ఉంటుంది కదా.ఆ ఆరాటం నుండి పుట్టిన కుతుహలంతో గూగుల్‌ను మ‌న ఇండియ‌న్స్ అడిగిన ప్ర‌శ్న ఏంటంటే క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చా అని.

కరోనా వ్యాక్సిన్ పక్రియ మొదలైన సంద‌ర్భంగా ఈ సంవత్సరం జ‌న‌వ‌రి 16, 17 వ తేదీల్లో ఈ ప్ర‌శ్న గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్‌ల‌లో ఒక‌టిగా నిలిచిందట.ఏం మనుషులండి బాబోయ్ ప్ర‌పంచ ‌వ్యాప్తంగా వేల మంది శాస్త్ర‌వేత్త‌లు కొన్ని నెల‌ల పాటు రాత్రి, ప‌గ‌లూ రీసెర్చ్‌లు చేసి, మ‌నుషుల‌పై ప్ర‌యోగాలు చేసి, చివ‌రికి కరోనా వ్యాక్సిన్‌ను తీసుకొస్తే దానిని ఇంట్లోనే ఫ్రీగా త‌యారు చేసుకుందామ‌ని మన ఇండియ‌న్స్ భావిస్తున్నారట.

ఇప్పటికే గూగుల్‌ను వింత వింత ప్ర‌శ్న‌ల‌తో వేధిస్తున్న భార‌తీయులు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తుందని కరోనా వ్యాక్సిన్ తయారి గురించి అడగడం పిచ్చి కాకపోతే ఏంటని నెటిజన్స్ అనుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube